Ashwini sri: బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. అల్లు అర్జున్ పొట్టోడంటూ..!

తెలుగులో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పారక్కర్లేదు. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తారో అని జనాలను ఆలోచనలో పడేస్తుంది ఈ సీజన్. సీరియల్ బ్యాచ్ తో పాటు కొత్త ముఖాలను కూడా హౌస్ లోకి తీసుకువచ్చారు బిగ్ బాస్. ఇక ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లినటువంటి వారిలో నటి అశ్విని ఒకరు. ఈమె ఐదవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు.

అశ్వినీ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు. అయితే తాజాగా ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అవమానించిన వివాదంలో చిక్కుకుంది. అసలు ఈమె ఎవరు..? ఈమె అల్లు అర్జున్ ని ఎందుకు అలా అవమానించింది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..! ఈమె గతంలో కొన్ని లో బడ్జెట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఆ తరువాత టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ లో నటించడం మొదలుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మికకి అక్కగా కూడా కనిపించింది.

ఈ బ్యూటీ ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొనసాగుతుంది. అయితే ఈమె హౌస్ లోకి ప్రవేశించేముందు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఈమె అల్లు అర్జున్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అభిమానులను కించపరిచాయి. ప్రభాస్ తన ఎత్తు ఉంటాడని, అతనే తనకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పింది. అయితే ఈ సమయంలోనే అల్లు అర్జున్ పొట్టిగా ఉంటాడని పరోక్షంగా ఆమె నోరు జారింది. తనతో ఐటెం సాంగ్ చేయాలంటే బన్నీ స్టూల్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కామెంట్ చేయడంతో అల్లు అభిమానులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. వెంటనే ఆమె తమ హీరోకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు