Tiger Nageswara Rao: కత్తెర పడ్డాక స్పీడ్ పెంచిన టైగర్ – గట్టెక్కుతుందా..?

మాస్ మహారాజ రవితేజ టైటిల్ రోల్ లో నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో రవితేజ పర్ఫామెన్స్ ఆకట్టుకున్నప్పటికీ డ్యూరేషన్ 3గంటలకు పైగా ఉండటం, ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ అనవసరం అనిపించటంతో ఆడియన్స్ ఈ సినిమాను యాక్సెప్ట్ చేయలేకపోయారు.
కథ, కథనాల్లో లోపాలకు తోడు థియేటర్స్ కూడా ఆశించిన స్థాయిలో దక్కకపోవడం వల్ల టైగర్ వసూళ్ల పరంగా వెనకబడింది. సినిమా రిజల్ట్ చూసి రియలైజ్ అయిన సినిమా యూనిట్ డ్యూరేషన్ ని తగ్గించి 2 గంటల 37 నిముషాలకు కుదించింది. డ్యూరేషన్ తగ్గించాక కలెక్షన్స్ పరంగా టైగర్ మెల్లిగా పుంజుకుంటోంది.
రవితేజ ఫ్యాన్స్ సహా మాస్ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. డ్యూరేషన్ తగ్గించాక సినిమా క్రిస్పీగా అనిపించటంతో ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతున్నాడు. దసరా తర్వాత రోజు నుండి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఫస్ట్ వీకెండ్ తర్వాత లియో సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవ్వటం కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాకి ప్లస్ అయ్యిందనే చెప్పాలి.
ఇదే డ్యూరేషన్ మొదటి నుండి ఉండుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒక పక్క భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని ఇప్పటికే 50కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి దూసుకుపోతుండగా లేట్ గా స్పీడ్ పెంచిన టైగర్ నాగేశ్వరరావు సినిమా సేఫ్ జోన్ కి చేరుతుందా లేదా అన్నది చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు