Biggboss nomination: కుండనెందుకు నా నెత్తి పగలగొట్టండి..! అశ్విని కి మళ్ళీ కోపమొచ్చింది?

టెలివిజన్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో ఆరోవారం నైని పావని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్ గా వచ్చిన వారం రోజులకే బాగా ఆడుతున్న పావని ఎలిమినేట్ అవడం షాకింగ్ గా మారింది. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని భావించారు కాబట్టే బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా నైని వెళ్లిపోతుంటే చాలా ఫీల్ అయ్యారు.
ఇక తర్వాతి వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

ఈ వారం నామినేషన్ల ని హౌస్ మేట్స్ వాళ్ళు నామినేట్ చేసే కంటెస్టెంట్ల యొక్క కుండని పగులగొట్టడం ద్వారా చేయమని బిగ్ బాస్ ఆదేశించడం జరిగింది. అయితే ఈ నామినేషన్ లో ఎక్కువగా అశ్వని శ్రీ, భోళే షావలి కి పడ్డాయి. అయితే నామినేషన్ టైం లో ఎక్కువ మంది వరుసగా అశ్విని శ్రీ ని నామినేట్ చేసేసరికి కోపమొచ్చినట్టుంది. రీసన్ ఏంటో కూడా కనుక్కోకుండా ఎక్కువ మాట్లాడింది.

ఫస్ట్ వీక్ లో ఎవ్వరూ తనతో మాట్లాడడం లేదని ఏడుపుమొహం పెట్టిన అశ్విని ఈ వారం మాత్రం తనని ఎవ్వరూ స్ట్రాంగ్ అని ఒప్పుకోవడం లేదని వాదించడం మొదలెట్టింది. ఇక ప్రియాంక నామినేట్ చేస్తుంటే, ఒక్క సరిగా కుండనెందుకు నా నెత్తి పగలగొట్టండి అంటూ అనేసింది. ఇక ఈ షో చూస్తున్న ఆడియన్స్ అశ్విని బిహేవియర్ కి నవ్వాలో, ఏడవాలో తెలియక చిన్న చూపు చూస్తున్నారు. ఇలాగే ఈ వారం కూడా ఉంటే ఎలిమినేషన్ నుండి ఎవ్వరూ తప్పించలేరు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు