Biggboss season7: సొట్ట సుందరికి రైతు బిడ్డకి, అమర దీపానికి తేడా తెలీదా?

 

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఆరో వారం ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేసింది. ఈ వారం చాలా మంది ఆడియన్స్ అశ్విని, లేదా భోలే శావళి ఎలిమినేట్ అవుతారని అనుకున్నా, అనూహ్యంగా నైని పావని ఎలిమినేట్ కావడం షాకింగ్ గా మారింది. బిగ్ బాస్ లో నాగార్జున చెప్పినట్టు అంతా ఉల్టా పల్టాగా సాగుతుందన్నట్టు, బిగ్ బాస్ నిర్ణయం మేరకే నైని పావని ఎలిమినేట్ అయ్యిందని వోటింగ్ వల్ల కాదని కొందరు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక తాజాగా బిగ్ బాస్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలవగా, ఈ నామినేషన్లో కుండలు పగలగొట్టడం ద్వారా నామినేట్ చేస్తున్నట్టు ప్రోమోలో చూపించారు. ఇక ఈ నామినేట్ చేసే టైంలో ఎక్కువ మంది అశ్విని ని నామినేట్ చేసినట్టు తెలుస్తూనే ఉంది.

- Advertisement -

అయితే అమర్ దీప్ అశ్విని ని నామినేట్ చేస్తున్న సందర్భంలో అశ్విని శ్రీ అమర్ దీప్ తో వాదిస్తూ, ప్రశాంత్ ని మాట్లాడుతుంది. అటు వైపు ప్రశాంత్ నెమో అమర్ అని పిలుస్తుంది. దీంతో కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రోమో చూసిన ఆడియన్స్ రైతు బిడ్డకి అమర్ కి కూడా తేడా తెలియట్లేదా? వాళ్ళేమైనా ట్విన్సా కన్ఫ్యూజన్ అవడానికి అంటూ అశ్వనిని ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరైతే ఆట విషయంలోనూ కన్ఫ్యూజనే, పేర్ల విషయంలోనూ కన్ఫ్యూజనే, అందుకే బిగ్ బాస్ కూడా ఏదో కన్ఫ్యూజన్ లో పావని ని పంపించేశాడు, ఈసారి అశ్విని విషయంలో కన్ఫ్యూజ్ అవ్వడు అంటున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు