Gunturu kaaram: “మహేష్” అంటే పేరు కాదు.. its a brand..

 

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నట శేఖర కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టినా, అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుని ప్రిన్స్ నుండి సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోల పేరు చెప్తే అందులో ఫస్ట్ ఉండేది మహేష్ ఒక్కడే.

ఇక మహేష్ బాబు తన సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ ద్వారా కూడా ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉంటాడు. ఇండస్ట్రీ లో తాను చేయని యాడ్ లేదు. కూల్ డ్రీంక్ నుండి షాంపూ దాకా, బిజినెస్ యాడ్స్ నుండి ఫ్యాషన్స్ యాడ్ దాకా అన్ని చేసాడు. అయితే మహేష్ బాబు తాను చేసే యాడ్స్ నుండి వచ్చే మెజారిటీ డబ్బుల్ని చారిటీ కోసం ఉపయోగిస్తున్నాడని తెలిసిందే. ఇప్పటివరకు 1000 మంది చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. అందుకే మహేష్ బాబు ఏ యాడ్ లో నటించినా, ఎలాంటి యాడ్స్ పెర్ఫార్మ్ చేసినా ఆడియన్స్ నెగిటివ్ గా భావించరు.

- Advertisement -

ఇక తాజాగా మహేష్ బాబు “హలో” మ్యాగ్ జైన్ కి ఇచ్చిన ఫోటోషూట్ యూత్ ని తెగ అట్రాక్ట్ చేస్తుంది. నిజానికి మహేష్ సింపుల్ గా షర్ట్ వేసుకుని స్మైల్ ఇస్తే చాలు ఆ బ్రాండ్ డ్రెస్ లక్షల్లో అమ్ముడుపోతాయి. ఇక ఆ స్టిల్స్ లో అలీమ్ హకీమ్ సెట్ చేసిన హెయిర్ స్టయిల్ కూడా సూపర్ గా ఉంది.

ఓవరాల్ గా మహేష్ బాబు స్టయిల్ లోనే చెప్పాలంటే మహేష్ అంటే పేరు కాదు “ఇట్స్ ఎ బ్రాండ్”.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు