Bhagavanth Kesari Story: బలం సెకండాఫే… శ్రీలీల విషయంలో బిగ్ ట్విస్ట్ ఇదే..!

ఈ ఏడాది దసరాకి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నాయి. వీటికి అదే రేంజ్ లో అంచనాలు కూడా ఉన్నాయి. కానీ, బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాపై ఈ రెండు సినిమాల కంటే ఎక్కువ హైప్ ఉంది. అందుకే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్స్ దక్కాయి.

ఇప్పటి వరకు డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన దాని ప్రకారం.. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయం… విలన్స్ వల్ల భగవంత్ కేసరి ఫ్యామిలీ ఇబ్బందులు ఎదర్కొనే సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. ఇక సినిమాకు హై ఇచ్చేది ఇంటర్వెల్.. సెకండాఫ్ అని అర్థమవుతుంది. ఇంటర్వెల్ తో సినిమా ఒక్కసారిగా లేస్తుందని.. ఇక సెకండాఫ్ లో బాలయ్య హవా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్ లో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.

నేలకొండ భగవంత్ కేసరి చాలా ఏళ్ల పాటు జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఖైదీ నెంబర్ 108 అంటే ఏమిటి? శ్రీలీల హీరో కూతురు కాకపోయినా, ఆమె కోసం ఎందుకు అంత రిస్క్ చేస్తున్నాడు? శరత్ కుమార్ కి శ్రీలీలకు ఉన్న సంబంధం ఏమిటి? శరత్ కుమార్ కు బాలయ్య ఇచ్చిన మాట ఏంటి? ఆ మాట కోసం బాలయ్య ఏం చేశాడు లాంటి అంశాలను సెకండాఫ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా గ్రాండ్ గా చూపించాడని సమాచారం.

- Advertisement -

ఇటీవల వచ్చిన ట్రైలర్ లో సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు రివీల్ అయినా, సినిమాలో ఇంకా చాలా ట్విస్ట్ లు ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీలీల, శరత్ కుమార్ పాత్రల గురించి వచ్చే ట్విస్ట్ అదిరిపోతుందని సమాచారం. అలాగే అర్జున్ రాంపాల్ పాత్రకు సంబంధించి కూడా ఓ ట్విస్ట్ ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి. ఇలా సెకండాఫ్ లో హై యాక్షన్ సన్నివేశాలతో పాటు ఊహకు అందని ట్విస్ట్ లు ఉంటాయని తెలుస్తుంది. మొత్తంగా ఆడియన్స్ కు బాలయ్య కొత్త అవతారం కనిపిస్తుందని టాక్.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Bollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest Tollywood entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు