Srimukhi: శ్రీముఖి లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా.. చిట్ చాట్ లో అసలు విషయం లీక్..!

బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు వున్నా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ బ్యూటీనే కాదు అంతకుమించి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూ బుల్లితెర రాములమ్మగా మరింత పేరు దక్కించుకుంది శ్రీముఖి. పటాస్ షో ద్వారా యాంకర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన ఈమె ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారింది. అంతేకాదు సినిమా ఈవెంట్లకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ భారీ క్రేజ్ దక్కించుకుంది. అంతేకాదు హాట్ గా గ్లామర్ షో చేస్తూ బుల్లితెర పైన, సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

సినిమాలలో కూడా నటిస్తూ వెండితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. మూడు పదుల వయసు దాటి నాలుగు పదుల వైపు దూసుకు వెళ్తున్న శ్రీముఖి ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అడపాదడపా చాలా టీవీ షోలలో ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నా.. తెలివిగా తప్పించుకుంటుంది. అంతేకాదు తాజాగా ఆమె మనసులో ఉన్న అసలు విషయాన్నీ ఫ్యాన్స్ బయటపెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా అభిమానులతో ఇంస్టాగ్రామ్ ఛానల్లో చిట్ చాట్ నిర్వహించింది. మొదటిసారి ఈమె ఇలా అభిమానులతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా శాంపిల్ గా కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలిపింది. ఇందులో ప్రధానంగా ఒక రహస్యాన్ని బయటపెట్టింది శ్రీముఖి.. ఇకపోతే తన లవ్ సీక్రెట్ ని కూడా తాజాగా వెల్లడించింది. శ్రీముఖి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అన్నది పరోక్షంగా వెల్లడించింది .

చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని మీరు ఎప్పుడైనా లవ్ లో ఫెయిల్ అయ్యారా? అని ప్రశ్నించగా మరో ఆలోచన లేకుండా చాలా సార్లు అంటూ సమాధానం తెలిపింది. దీంతో హార్ట్ బ్రేక్ అయ్యే ప్రేమ కథలు చాలానే ఉన్నాయి అన్న విషయాన్ని దాచినా.. ఆ రహస్యాన్ని కూడా బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ . ఇకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటావనే ప్రశ్నలు ఎదురవగా.. వాటికి సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంది. పెళ్లి గురించి చెప్పమంటే మాత్రం దాని గురించి చెప్పడానికి సమయం సరిపోదు.. ఎంతైనా చెప్పవచ్చు అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇక మరొక అభిమాని మీరు పెళ్లి చేసుకుంటే యాంకరింగ్ మానేస్తారా? అని అడుగుతూనే.. మీరు ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని.. ఆ దేవున్ని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు పెళ్లి చేసుకుంటే యాంకరింగ్ మానేస్తుందేమో అని ..తనను ఎక్కడ మిస్ అవుతాం ఏమో అన్న ఉద్దేశం లోనే అభిమాని ప్రశ్నించినట్లు సమాధానం. మొత్తానికి అయితే తాను కూడా లవ్లో ఫెయిల్ అయ్యాను అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు