Tollywood: ఆ బడా డైరెక్టర్ నన్ను గదిలోకి రమ్మన్నారు.. షకీల సంచలన వ్యాఖ్యలు..!

శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె సినిమాలకు అప్పట్లో యూత్ మొత్తం క్యూ కట్టేసేవారు. ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు వచ్చింది. ఇక ఆమె జీవితం అందరికీ తెరిసిన పుస్తకమే. షకీల ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో తనకి ఎదురైన చేదు అనుభవాలను.. అలాగే తన సొంత ఫ్యామిలీ ద్వారా ఎదురైన ఇబ్బందులను అన్నింటినీ బయటపెట్టింది. సినిమా అవకాశాల కోసం వెళితే ఎంతోమంది తనను కమిట్మెంట్ అడిగారని నిర్మొహమాటంగా చెప్పుకొస్తూ ఉంటుంది షకీల.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ దర్శకుడు తనని గదికి పిలిచాడని చెప్పుకొచ్చింది. ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీల ఈ సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు అగ్ర హీరో లైంగిక వేధింపుల కారణంగానే సినీ ఇండస్ట్రీ నుండి వైదొలిగానని ఇటీవల తమిళ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నటి షకీల విచిత్రకు మద్దతు తెలుపుతూ తనకు కూడా టాలీవుడ్ లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని చెప్పుకొచ్చింది.

“విచిత్ర నాకు బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి కొన్ని సినిమాలలో నటించాము. ఏ హీరో ఆమెని గదిలోకి పిలిచాడు..? ఎవరి కారణంగా సినీ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందనేది విచిత్ర చెబితే బాగుండేది. అతడు ఎవరో బయటపెట్టి ఉండాల్సింది. నేను ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నేను కూడా ఇలాంటి కమిట్మెంట్స్ ఎదుర్కొన్నాను.

- Advertisement -

దర్శకుడు ఇవీవీ సత్యనారాయణతో కలిసి ఓ సినిమా చేశాను. ఈ సినిమా తరువాత మరో సినిమా అవకాశం ఇస్తాను.. రూమ్ కి వస్తావా..? అని అడిగారు. నేను వెంటనే సార్.. ఈ సినిమాకు నాకు డబ్బులు ఇచ్చేశారు. వేరే సినిమా నాకు అవసరం లేదని చెప్పాను. ఈ విషయాన్ని నేను ఎప్పుడైనా, ఎక్కడికైనా వచ్చి చెప్పమన్నా చెప్తాను. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు.. ఆయన నన్ను రూమ్ కి రమ్మన్నారు.. ఇది నిజం” అంటూ షకీల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు