V.K.Naresh: వీ.కే.నరేష్ భార్యల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన వీకే నరేష్ ఇప్పటికీ కూడా పలు సినిమాలలో హీరో హీరోయిన్లకు తండ్రిగా, మామగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో హీరోగా చేసిన ఈయన తాజాగా మళ్లీ పెళ్లి అనే సినిమాలో లీడ్ రోల్ పోషించారు. ఇకపోతే సినిమాల పరంగా ఎంత పాపులారిటీ అయితే దక్కించుకున్నారో.. వైవాహిక జీవితం గురించి కూడా అంతే వైరల్ గా నిలిచారు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన ముగ్గురికి విడాకులు ఇవ్వడమే కాదు కొంత కాలంగా నటి పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నారు అంటూ కూడా మరొకసారి వార్తల్లో నిలిచారు.

పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఇది ఇలా ఉండగా నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అన్న విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి .మరి వీరి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ప్రముఖ సీనియర్ డ్యాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను నరేష్ మొదటి వివాహం చేసుకోగా వీరిద్దరికీ నవీన్ విజయ్ కృష్ణ అనే ఒక బాబు కూడా పుట్టారు. ఇప్పటికే నవీన్ విజయ్ కృష్ణ రెండు సినిమాలలో హీరోగా నటించగా.. సాయి ధరమ్ తేజ్ తో సత్య అనే షార్ట్ ఫిలిం కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇకపోతే కృష్ణ పుట్టిన తర్వాతనే విభేదాలు వచ్చాయి. అందుకే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని రెండో వివాహం చేసుకున్నారు నరేష్. ఈ జంటకి కూడా ఒక కొడుకు జన్మించారు.. ఆ కొడుకు పేరు రణధీర్..ఇక వీరిద్దరికీ కూడా మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది.

- Advertisement -

ఇక మూడోసారి ప్రముఖ రాజకీయ నాయకుడు రఘువీరారెడ్డి సోదర కుమార్తె రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ తేజా అనే కొడుకు జన్మించారు. ఇకపోతే రమ్య రఘుపతి, నరేష్ మధ్య గొడవలు ఏ విధంగా జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో పవిత్ర లోకేష్ తో ఆయన ప్రేమ మొదలవడంతో రమ్య రఘుపతి ఆయనను మీడియా ముందు నిలబెట్టింది. ఇక అలా వీరిద్దరికీ జరిగిన వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇకపోతే అలా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన ముగ్గురు భార్యలతో ముగ్గురు మగ బిడ్డలకు తండ్రి అయ్యారు.. కానీ ఏ ఒక్క భార్యని కూడా తన దగ్గర ఉంచుకోకపోవడం గమనార్హం

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు