Mammootty:మమ్ముట్టి వల్ల ఆ స్టార్ హీరోయిన్ జీవితం నాశనం అయ్యిందా..?

మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎప్పుడు కూడా విభిన్నమైన కథలతో తన బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఈయన కేవలం మలయాళం లోనే కాకుండా సౌత్, నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరున్న నటుడుగా పేరుపొందారు.. గతంలో స్టార్ హీరోలుగా రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ ఇలా అందరూ కూడా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు . ఇక మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే..

గతంలో దుల్కర్ సల్మాన్ ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ టాలీవుడ్ లోకి మాత్రం సీతారామం సినిమాతో మరింత క్రేజ్ ను అందుకున్నారు. మమ్ముట్టి వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికి పలు సినిమాలలో  నటిస్తూ బిజీగా ఉన్నారు. గతంలో తన స్నేహితులతో కలిసి ఉన్న ఒక ఫోటో మమ్ముట్టికి సంబంధించి వైరల్ గా మారుతున్నాయి. మమ్ముట్టి ఈ ఫోటోలలో 30 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ఉన్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మమ్ముట్టి వల్ల ఒక స్టార్ హీరోయిన్ వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుంది అంటూ గతంలో మలయాళ ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వినిపించాయట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి హీరోయిన్ శోభన.. ఈమె పేరు ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ పాత చిత్రాలలో తన డ్యాన్స్ తో , అందంతో, నటనతో అందరిని బాగా ఆకట్టుకుంది. శోభన ఎన్నో దేశాలలో జరిగేటువంటి పలు రకాల నాట్య ప్రోగ్రాములలో ప్రదర్శన ఇచ్చింది. దానివల్ల వచ్చిన డబ్బుతో తను నడుపుతున్న ఒక చారిటీకి డొనేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా ఈమె ఇంకా వివాహానికి నోచుకోలేదు.

శోభన వివాహానికి దూరంగా ఉండడానికి కారణం మమ్ముట్టి అన్నట్టుగా సౌత్ ఇండస్ట్రీలో అప్పట్లో వార్తలు వినిపించాయి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలలో కెమిస్ట్రీ బాగుండడంతో పాటు వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు కూడా ఎక్కువగా వినిపించేవట. ఈ విషయం తెలుసుకున్న మమ్ముట్టి కుటుంబ సభ్యులు అతనికి వేరే వివాహం చేశారు. ముఖ్యంగా మతం అడ్డు రావడం చేత మమ్ముట్టి కుటుంబ సభ్యులు ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన అటు మమ్ముట్టి కానీ ఇటు శోభన కానీ ఎవరు స్పందించలేదు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు