Samantha: అలాంటి వ్యాధులతో బాధపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్..!!

చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా ఉండనే ఉంటాయి. అయితే ఇలాంటి విషయాలలో సెలబ్రిటీలు అయినా సాధారణ వ్యక్తులైన ఒక్కటిగానే సమస్యలు వెంటాడుతూనే ఉంటాయని చెప్పవచ్చు. కానీ చాలామంది సెలబ్రిటీలు అభిమానుల కోసం తమకి ఉన్న జబ్బులను సైతం దిగమింగుకొని మరి నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు. అలా చాలామంది సెలబ్రిటీలు సైతం భయంకరమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం . వారి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1). సమంత:
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ఈ మధ్యకాలంలో మయోసైటీస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి కారణంగా గత కొంతకాలంగా ఈమె సినిమాలకు విరామం ఇచ్చినట్లు సమాచారం.

2). నయనతార:
టాలీవుడ్, కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార స్కిన్ కి సంబంధించిన వింత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.. మేకప్ వేసుకుంటే తన శరీరం మొత్తం చాలా రాషష్ మారుతుందట.దీనికోసం ఆయుర్వేద చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -

3). స్నేహ ఉల్లాల్:
మొదట ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ పోలికలు ఉండడంతో జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పాపులారిటీ అందుకుంది.. ఈమెకు ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఎన్నోసార్లు షూటింగ్ లొకేషన్లో ఈమె పడిపోవడంతో ఇప్పటికి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

4). ఇలియానా:
గోవా బ్యూటీగా పేరుపొందిన ఇలియానా మొదట దేవదాసు సినిమాతో సక్సెస్ అయి పోకిరి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. గతంలో కాస్త సన్నగా ఉన్న ఇలియానా ఈ మధ్యకాలంలో అధిక బరువు పెరిగిపోయింది. అందుకు కారణం ఈమె శరీరం థిస్పర్మిక్ అనే డిసీజ్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

5). ప్రియాంక జవాల్కర్:
Sr. కళ్యాణమండపం సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా తదితర చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడికి థైరాయిడ్ సమస్యల వల్ల కాస్త బొద్దుగా మారిపోయినట్లు తెలియజేయడం జరిగింది.

వీరితోపాటు రేణు దేశాయ్ కూడా గుండె జబ్బులతో బాధపడుతున్నట్లు ఇటీవలే తెలియజేయడం జరిగింది. అలాగే హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు గత కొద్ది రోజుల క్రితం తెలియజేయడం జరిగింది. ఇక వీరే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు