Yatra-2: తెలుగు వాళ్ళు చేయలేరా, చెయ్యనన్నారా.?

పాఠశాల సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మహి వి రాఘవ్.  ఆనందోబ్రహ్మ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు.
ఆ సినిమా తర్వాత మహి వి రాఘవ్ చేసిన సినిమా యాత్ర.
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కెరియర్లో పాదయాత్ర తన పదవికి ఎంతగా తోడ్పడిందో మనందరికీ తెలిసిందే. అదే కాన్సెప్ట్ తీసుకొని యాత్ర అనే సినిమాతో ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్  ఆయన కలిసిన  మనుషులు, అప్పటి  పరిస్థితులు అన్నిటిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి మంచి హిట్ అందుకున్నాడు.ఈ సినిమాకి ఒక వర్గపు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు.
అయితే మహి వి రాఘవ్ ఇప్పుడు చేస్తున్న సినిమా యాత్ర -2.
యాత్ర సినిమాలో పాదయాత్రని చూపించిన మహి, ఈ సినిమాలో జగన్ యొక్క ఓదార్పు యాత్రను , జగన్ పదవి  పదవి పొందిన విధానాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ పాత్రలో తమిళ్ నటుడు జీవా నటిస్తున్నాడు.  వైఎస్ఆర్ పాత్రలో యాత్రలో నటించిన మమ్ముట్టి నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త చక్కెర్లు కొడుతుంది.
ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉంటుందని,
ఆ పాత్రను బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ పోషిస్తున్నారని తెలుస్తుంది. దీనిలో ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి అంటే  కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానున్నట్టు  ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. తమిళ్, మలయాళం,హిందీ నటులు మాత్రమే ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ రోల్స్ చేసే నటులు తెలుగులో లేరా , లేకుంటే రిజక్ట్ చేసారా అనేది కొంతమంది సందేహం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు