Bollywood: టైగర్ 3 ప్లాన్ అదుర్స్… టవల్ ఫైట్ తోనే స్టార్ట్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3. ఈ చిత్రం విడుదలకు ఇంకా రెండు వారాల టైం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చాలా పకడ్బందీగా చేస్తుంది. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే టైగర్ 3 కొత్తగా ఏం ఉండదని, యష్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే వచ్చిన సినిమాల్లానే ఉండబోతుందని ఓ టాక్ కూడా వచ్చింది.

కానీ, సల్మాన్ ఖాన్ పోరాట సన్నివేశాలు సినిమాకు కాస్త ప్లస్ పాయింట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. అయితే టైగర్ 3లో సల్మాన్ ఖాన్ ఫైట్ సీన్స్ కంటే, కత్రీనా కైఫ్ ఫైట్ సీన్ ఆకట్టుకోబోతుంది. కత్రీనా కైఫ్ ఫైట్ సీన్ అంటే… ట్రైలర్ లో కనిపించిన బాత్ టవల్ ఫైట్ సీన్. హాలీవుడ్ నటి మిచెల్ లీతో కత్రీనా కైఫ్ చేసిన టవల్ ఫైట్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. అంతే కాదు, రాబోయే సినిమాకు కూడా ఈ ఫైట్ సీన్ హైలైట్ గా నిలవబోతుందని కూడా చెప్పొచ్చు.

అందుకే చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ ను ఈ ఫైట్ సీన్ నుంచే స్టార్ట్ చేశారు. ఈ టవల్ ఫైట్ సీన్ లో కత్రినా తో కనిపించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ… కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. టవల్ ఫైట్ కోసం తాను కత్రినా కైఫ్ చాలా కష్టపడ్డామని, దాదాపు రెండు వారాల పాటు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్టు చెప్పింది. అలాగే దీన్ని కొత్తగా చూపించడానికి రెండు వారాల పాటు రీసెర్చ్ కూడా చేశామని చెప్పుకొచ్చింది. “టవల్స్ ని కింద పడకుండా ఫైట్ చేయడం కష్టమైన పనే. కానీ, ఇద్దరం అనుభవం ఉన్న యాక్టర్స్ కాబట్టి… చేయగలిగాం” అంటూ ఈ ఫైట్ సీన్ విషయాలను పంచుకుంది.

- Advertisement -

అలాగే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫైట్ సీన్ వైరల్ అవుతుందని ముందే ఊహించమని చెప్పుకొచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాకా… అందరూ టవల్ ఫైట్ గురించే మాట్లాడుకుంటారని హాలీవుడ్ నటి మిచెల్ లీ వివరించింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు