Daggubati Venkatesh: వెంకీ మామ సినిమాని కాజల్ ఎందుకు వదులుకుందో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ – ఫ్యామిలీ ఆడియన్స్ కి రిలేషన్ బాగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సినిమాలకు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా వెంకటేష్ సినిమా విడుదలవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు. ఎన్నో విభిన్నమైన సినిమాలు తీస్తూ ఘన విజయాలను అందుకున్నారు విక్టరీ వెంకటేష్. అలాంటి వెంకటేష్ తో సినిమా చేయడానికి ఏ హీరోయిన్ అయినా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది.

వెంకటేష్ వంటి స్టార్ హీరోతో సినిమా అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనని హీరోయిన్లు భావిస్తుంటారు. ఇలా చాలామంది హీరోయిన్లు ఇప్పటికే వెంకటేష్ తో జతకట్టి పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్స్ గా పాపులారిటీ దక్కించుకున్నారు. వారిలో టబు, దివ్యభారతి, కత్రినా కైఫ్ వంటి ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. వీరందరూ ఒకప్పుడు వెంకటేష్ తో సినిమాలు చేసి పాపులర్ అయ్యి బాలీవుడ్ వైపు అడుగులు వేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే అలాంటి క్రేజీ హీరోతో సినిమా చేయడానికి మాత్రం ఓ టాలీవుడ్ హీరోయిన్ నో చెప్పిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్. వెంకటేష్ – నాగ చైతన్య కాంబినేషన్ లో వెంకీ మామ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా, వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించారు. అయితే ఈ చిత్రంలో మొదట వెంకీ మామ సరసన కాజల్ అగర్వాల్ ని అడిగారట.

- Advertisement -

కానీ కాజల్ అప్పటికే నాగచైతన్యతో కలిసి దడ అనే చిత్రంలో నటించింది. మరోసారి నాగచైతన్యతో నటిస్తే హీరోయిన్ గానే నటిస్తాను కానీ ఇతర పాత్రలలో నటించలేనని.. ఆ కారణంగానే ఈ చిత్రంలో చైతన్యకి అత్తగా నటించడం ఇష్టం లేక ఈ సినిమాని వదులుకుందుట కాజల్ అగర్వాల్.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు