Balakrishna: బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదగడానికి కారణం ఆమెనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇటీవలి కాలంలో వరస సక్సెస్ లు అందుకుంటూ మంచి విజయాలతో దూసుకుపోతున్నారు బాలకృష్ణ. తాతమ్మ కళ సినిమాతో బాలయ్య సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించక పోయినప్పటికీ నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ బాలయ్య కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు.

అయితే బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదగడానికి ఆయన కూతురు బ్రాహ్మణి జాతకమే కారణమని.. ఆమె పుట్టిన తర్వాతే బాలయ్యకు కెరీర్ పరంగా ఎంతో కలిసి వచ్చిందని ఇండస్ట్రీలో ఉన్న ఓ టాక్. బ్రాహ్మణి 1988వ సంవత్సరం డిసెంబర్ 21న జన్మించింది. బ్రాహ్మణి పుట్టిన తర్వాత బాలయ్య నటించిన విడుదలైన భలే దొంగ సినిమా హిట్ గా నిలిస్తే.. ముద్దుల మామయ్య సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తరువాత నారీ నారీ నడుమ మురారి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య.

ఈ సినిమాల కారణంగానే బాలయ్యకు అప్పట్లో ఊహించని స్థాయిలో స్టార్ డమ్ వచ్చింది. అయితే కొన్ని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఆయన కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. బ్రాహ్మణి జాతకం నిజంగా మంచి జాతకం అని ఇండస్ట్రీలో టాక్. ఇక అటు ఈమె నందమూరి కుటుంబం మరోవైపు నారావారి కుటుంబానికి ఓ ఆశాజ్యోతి గా కనబడుతోంది. ఇప్పటికే బ్రాహ్మణి హెరిటేజ్ గ్రూప్ లో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా తన తండ్రి చైర్మన్ గా ఉన్న బసవతారం క్యాన్సర్ ఆసుపత్రికి మరియు ట్రస్ట్ కి బోర్డు మెంబర్ గా కొనసాగుతోంది. వ్యాపార రంగంలో సైతం బ్రాహ్మణి సంచలన విజయాలను సొంతం చేసుకుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు