Bala Krishna: బాలయ్య సినిమాలో మరో స్టార్ హీరో ?

నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భగవంత్ కేసరి సినిమాతో మరో బాలకృష్ణను ఆడియన్స్ ముందుకు తీసుకు తీసుకువచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య నటనకు ఆడియన్స్ మరోసారి ఫిదా అయ్యారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది.

దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఇందులో కాజల్ కీలక పాత్రలో కనిపించింది. ఇది ఇలా ఉండగా…. బాలయ్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబి తెరకెక్కించనున్నాడు. వాల్తేరు వీరయ్య చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న బాబి, బాలయ్యతో చెయ్యబోయే చిత్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యే మొదలైనట్టు తెలుస్తోంది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నాడట. మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు బాలయ్య కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి సమాచారం లేదు.
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు