Vaishnav Tej: మెగా ఇంట రీతూ వర్మ.. రూమర్స్ పై నోరు విప్పిన వైష్ణవ్ తేజ్..!

మెగా ఫ్యామిలీ కి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబం నుంచి దాదాపుగా చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న వార్త అయినా సరే ఇట్టే వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుటుంబంతో ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కలిశారు అంటే కచ్చితంగా ఆ కుటుంబ సభ్యులతో రూమర్స్ సృష్టిస్తూ ఉంటారు నెటిజన్స్.

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ లో రీతూ వర్మ కనిపించేసరికి రూమర్స్ కి తెర లేపారని చెప్పవచ్చు. సాధారణంగా ఏ ఒక్క హీరోయిన్ అయినా సరే ఇతరులతో కలిసి కనిపిస్తే నిజంగా వారితో సంబంధం ఉందని రూమర్స్ సృష్టిస్తున్న సమయంలో రీతూ వర్మ ఇలా మెగా ఫ్యామిలీలో కనిపించేసరికి నిజంగా ఆమె మెగా హీరోలలో ఒకరిని వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు సృష్టించారు. అసలు విషయంలోకెళితే ఇటీవల మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల పెళ్లి ఇటీవల ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే.

అయితే ఈ పెళ్లికి సంబంధించి జరిగిన అన్ని వేడుకలలో కూడా మెగా ఫ్యామిలీతో పాటు హీరోయిన్ రీతూ వర్మ కూడా కనిపించింది. అంతేకాదు అల్లు అర్జున్ – స్నేహ ఇచ్చిన ప్రీ వెడ్డింగ్ పార్టీలో కూడా మెగా ఫ్యామిలీతో పాటు రీతూ వర్మ కూడా కనిపించేసరికి ఇలాంటి రూమర్స్ సృష్టించారు. లావణ్య మెగా ఇంటి కోడలు అయినట్లుగానే రీతూ కూడా మెగా ఇంటికి కోడలు కాబోతోంది అంటూ వార్తలు ప్రచారం చేశారు. అయితే ఈ విషయాలపై అటు రీతూ వర్మ ఇటు మెగా ఫ్యామిలీ ఎవరు కూడా స్పందించలేదు.

- Advertisement -

అయితే ఇప్పుడు ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టారు. ప్రస్తుతం ఆదికేశవ ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న వైష్ణవ్ తేజ్..పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ.. ఈ విషయాన్ని రివీల్ చేశారు. తాజాగా వరుణ్ , లావణ్య వెడ్డింగ్ పార్టీకి రీతూ వర్మ రావడానికి కారణం అదే అని ఆయన స్పష్టం చేశారు.

లావణ్య త్రిపాఠి కి రీతూ వర్మ మంచి స్నేహితురాలు.. ఆ కారణంగానే తాను మెగా పెళ్లి వేడుకల్లో కనిపించింది. అంతకుమించి మీరు ఊహించినట్లుగా ఏమీ లేదు అంటూ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. ఇక దీంతో నెటిజన్స్ కూడా అవును నిజమే.. లావణ్య , రీతూ మంచి స్నేహితులు అంటూ వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు