K. Viswanath: కళాతపస్వి విశ్వనాథ్ కెరియర్ నే మార్చేసిన వ్యక్తి ఎవరంటే..?

దివంగత దర్శకులు, ప్రముఖ నటులు కళాతపస్వి కే. విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి తన అద్భుతమైన డైరెక్షన్ లో ఎంతోమంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికంటూ ఒక జీవితాన్ని అందించారు. ఒకవైపు దర్శకుడిగా సినిమాలకు బాధ్యతలు చేపట్టిన ఈయన పలు సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇకపోతే తన సినిమాలతో ఎన్నో మరెన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఈయన కళాతపస్విగా పేరు దక్కించుకున్నారు.

ఇక దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు ఏం చేసేవారు? ఆయన కెరియర్ కి పునాది వేసింది ఎవరు? అన్న విషయాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. కళాతపస్వి కే విశ్వనాథ్ అసలు పేరు కాశీనాథుని విశ్వనాథ్.. 19- ఫిబ్రవరి -1930 న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన ఈయన గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి..

ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. మరోవైపు సినిమాల పైన ఆసక్తి ఉన్న కళాతపస్వి కే.విశ్వనాథ్ చదువు పూర్తయిన వెంటనే వారాహి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు.

- Advertisement -

ఆయన మొదటిసారి 1957లో వచ్చిన తోడికోడళ్ళు సినిమా ద్వారా సౌండ్ ఇంజనీర్ గా తన సినిమా కెరియర్ను మొదలుపెట్టారు. అదే సమయంలో ఆయన పనితనాన్ని గమనించిన దర్శకుడు అదుర్తి సుబ్బారావు సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చి తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించుకున్నారు.

ఆ తర్వాత డైరెక్షన్ విభాగంలో ఆయనకు అన్ని మెలకువలు నేర్పించిన ఆదుర్తి సుబ్బారావు ఆ తర్వాత ఆయన దగ్గరే ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి , మూగమనసులు, చదువుకున్న అమ్మాయిలు వంటి అక్కినేని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయిస్తూ డైరెక్టర్ వైపుగా ప్రోత్సహించారు.

ఇక అలా ఆదుర్తి సుబ్బారావు దగ్గర అన్ని మెలకువలు నేర్చుకున్న కె విశ్వనాథ్ కి అక్కినేని నాగేశ్వరరావు అవకాశం కల్పించారు. అలా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ఆత్మగౌరవం అనే సినిమా ద్వారా దర్శకుడిగా అవకాశాన్ని దర్శించుకుని తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా విజయం సాధించినప్పటికీ కూడా అవకాశాలు రాలేదు.

మొదట్లో కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహించి.. ఆ తర్వాత సిరిసిరిమువ్వ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను వెలుగులోకి తెచ్చుకొని ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు తెరకు అందించారు.

ఇక తర్వాత 50 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన తన చిత్రాల ద్వారా తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించారు. అంతేకాదు తన అద్భుతమైన దర్శకత్వానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఇలా ఎంతో మంది గొప్ప దర్శకులు ఇండస్ట్రీని వీడి వెళ్లడం నిజంగా బాధాకరమని చెప్పాలి

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు