Naga Chaitanya: దూత కోసం భారీగా డిమాండ్ చేస్తున్న చైతూ..ఎన్ని కోట్లంటే..?

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను నమ్ముకున్నారు. తాజాగా దూత అనే వెబ్ మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు .ఈ క్రమంలోనే ఈ వెబ్ మూవీ కోసం నాగచైతన్య ఎంత పారితోషకం తీసుకోబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే నాగచైతన్య తన తాత , తండ్రిలాగా టాప్ హీరోగా మారలేకపోయాడు. కానీ టైర్ 2 హీరోల లిస్టులోనే ఉండిపోయారు. ఇక ఎంత ప్రయత్నం చేసినా సరే హిట్టయితే పడుతోంది కానీ స్టార్ హీరో మాత్రం కాలేకపోతున్నారు నాగచైతన్య.

ఇకపోతే స్టార్ హీరోగా అవ్వకపోయినా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గతంలో బంగార్రాజు లవ్ స్టోరీ వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు కానీ ఆ తర్వాత నటించిన కస్టడీ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక అందుకే డిజిటల్ ఎంట్రీ కి సిద్ధమయ్యారు నాగచైతన్య. ఇదిలా ఉండగా గతంలో దర్శకుడు కే.విక్రం దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ మొదలుపెట్టగా తాజాగా అది కంప్లీట్ అయింది. స్ట్రీమింగ్ కి కూడా సిద్ధం అవుతోంది.

ఇదిలా ఉండగా ఈ వెబ్ మూవీ స్టార్ట్ అయ్యి చాలాకాలం అవుతున్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ దూత వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా థ్రిల్లింగ్ ,యాక్షన్ ,సన్నివేశాలను ఇందులో చాలానే ఉంచినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. ఇకపోతే సినిమాల ద్వారా సరైన సక్సెస్ లేకపోయినా ఈ వెబ్ మూవీ కోసం ఆయన భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వెబ్ మూవీకి గాను నాగచైతన్య 8 కోట్ల రూపాయలు రెమినరేషన్ తీసుకుంటున్నారట సాధారణంగా ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల వరకు తీసుకునే నాగచైతన్య ఈ వెబ్ మూవీకి మాత్రం రూ.8 కోట్లు అందుకుంటున్నాడని సమాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు