Razakar: సాయుధ రైతాంగ పోరాట అమర వీరుల కన్నీటి గాథ.. ఈ పోతుగడ్డ పాట..!

తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “రజాకార్”. తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో రాబోతున్న మొదటి సినిమా ఇదే నని డైరెక్టర్ యాట సత్యనారాయణ చెప్పడం జరిగింది. ఇక ఈ సినిమాని సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ లో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నాడు. రజాకార్ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్, ఇంకా టీజర్ ఇప్పటికే ఆకట్టుకోగా, ఒక్కొక్కటిగా పాటలు కూడా రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుకుతున్నారు.

ఇక రజాకార్ సినిమా నుండి తాజాగా రిలీజ్ అయిన ఓ పాట మాత్రం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. చనిపోయిన తెలంగాణ పోరాట అమర వీరులపై చిత్రీకరించిన ఈ భావోద్వేగభరితమైన గీతం జనాల మనసుల్ని కదిలిస్తుంది. “పోతుగడ్డ” అంటూ ఎంతో హృద్యంగా సాగే ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయడం జరిగింది. తాను రాసిన ‘నేను సైతం’, కొమరం భీముడొ సాంగ్ తర్వాత అంతటి పేరు తెచ్చే పాటగా ఈ పోతుగడ్డ పాట నిలుస్తుందని సుద్దాల అశోక్ తేజ వ్యాఖ్యానించారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన ట్యూన్స్ కూడా పాట లిరిక్స్ కి తగ్గట్టుగా ఉండగా, తానే స్వయంగా ఈ పాటను పాడడం జరిగింది.

- Advertisement -

ఇక పాట మేకింగ్ వీడియో బట్టి సినిమాలో ఈ పాట ఎంత కీలకమో అర్ధమవుతుంది. ఇక ఈ పోతుగడ్డ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు, లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, అలాగే హీరో బాబీ సింహా పాల్గొనడం జరిగింది. ఇక రజాకార్ సినిమాని 2024 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు