Hi Nanna: ఒడియమ్మ… చియాన్ విక్రమ్ కొడుకు ఏం పాడాడురా బాబూ !

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “హాయ్ నాన్న” అనే మూవీ త్వరలోనే థియేటర్లోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. “ఒడియమ్మ” అనే ట్రెండీ లిరిక్స్ తో అందరిని బాగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ “హాయ్ నాన్న” మూవీలో నాలుగవ పాట. ఈ మాస్ పెప్పీ పార్టీ సాంగ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ పాట పాడింది మాత్రం కోలీవుడ్ స్టార్ హీరో ధృవ్ విక్రమ్ కావడం విశేషం. ధృవ్‌కి ఇదే తొలి తెలుగు పాట.

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ధృవ్ మొదటి చిత్రంతోనే నటన పరంగా తన ట్యాలెంట్ ను నిరూపించుకున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి” మూవీని “ఆదిత్య వర్మ” పేరుతో కోలీవుడ్లో రీమేక్ చేయగా, ఆ మూవీతోనే ధృవ్ హీరోగా పరిచయమయ్యాడు. అదే సమయంలో తనలోని సింగింగ్ టాలెంట్ ను కూడా బయట పెట్టాడు. “ఆదిత్య వర్మ” సినిమాలో ఓ సాంగ్ కూడా పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పటిదాకా రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన ఈ యంగ్ హీరో తాజాగా టాలీవుడ్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చేశాడు. “ఒడియమ్మ” సాంగ్ తో ప్రొఫెషనల్ సింగర్ గా మారిపోయాడు. ఆయన గాత్రానికి సంగీత ప్రియులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ మల్టీ టాలెంటెడ్ హీరో గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. స్టైలిష్ లుక్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా, సింగర్ గా కూడా మారి ఈ తరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నాడు ధృవ్. మరి ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ?

ఇక “హాయ్ నాన్న” విషయానికొస్తే… ఇంతకు ముందు కొన్ని మెలోడియస్ ట్యూన్స్ ఇచ్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ “ఒడియమ్మ” అనే రాకింగ్ సాంగ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఈ సాంగ్ కోసం ధృవ్ విక్రమ్ తో పాటు పాపులర్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్వరం కలిపింది. అంతేకాకుండా మూవీకి ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న శృతి హాసన్ కూడా ఈ సాంగ్ లో భాగం కావడం విశేషం. ఇక “హాయ్” నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, డిసెంబర్ 7న థియేటర్లలో సందడి చేయడానికి ఈ మూవీ రెడీగా ఉంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు