Hi Nanna : రెండు సినిమాల దారులు వేరు… కానీ ఎమోషన్ ఒకటే

నవంబర్ లో థియేటర్లు చాలా వరకు వెలవెలబోయాయి. ఒకటి రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ వరల్డ్ కప్ ఫీవర్, తెలుగు రాష్రాల్లో కొనసాగుతున్న ఎలక్షన్ హీట్ వల్ల థియేటర్ల వైపు అడుగు వేయడానికి కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అలాగే ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన పెద్ద సినిమా నిర్మాతలు తమ సినిమాలను నవంబర్ లో రిలీజ్ చేయలేదు. కానీ డిసెంబర్లో మాత్రం సినిమా థియేటర్లు కొత్త కళను సంతరించుకోబోతున్నాయి. 2023 డిసెంబర్ లో పలు భారీ సినిమాలు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అందులో ముందుగా రాబోయేది యానిమల్, హాయ్ నాన్న. ఈ రెండు సినిమాలు కూడా తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని, బలమైన భావోద్వేగ నేపథ్యాలతో ప్రేక్షకులను ఆకర్షించడానికి రాబోతున్నాయి.

అయితే ఈ రెండు సినిమాలలో ఎమోషన్ ఒక్కటే.. కానీ ఆ కథను ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి డైరెక్టర్స్ ఎంచుకున్న దారులు వేరు. “యానిమల్” మూవీ విషయానికి వస్తే… సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా అనిల్ కపూర్ హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి, కొడుకుల మధ్య బంధాన్ని హైలెట్ చేస్తూ వస్తోంది. అయితే తండ్రి ప్రేమ పొందలేని హీరో ఎంత వైలెంట్ గా మారాడు? తన తండ్రిపై హత్యాయత్నం చేసిన విలన్లపై ఎలాంటి వైలెన్స్ చూపించాడు? అనే అంశాలను ప్రధానంగా తీసుకుని హింస నేపథ్యంలో రాబోతోంది ఈ మూవీ. మొత్తానికి తండ్రి, కొడుకునే సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఇక హాయ్ నాన్న విషయానికి వస్తే… నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో రాబోతోంది. తల్లి లేకపోవడం వల్ల ఆ తండ్రి, కుమార్తె మధ్య నెలకొన్న సున్నితమైన భావోద్వేగ ప్రయాణంపై డైరెక్టర్ శౌర్యువ్ దృష్టి పెట్టాడు. ఈ సినిమా మొత్తం చాలా సున్నితంగా, ఎమోషనల్ గా సాగుతుంది. ఇలా రెండు సినిమాల్లో ఎమోషన్ ఒక్కటే. కానీ దర్శకుల కోణాలు వేరు. కాగా “యానిమల్” మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుండగా, “హాయ్ నాన్న” మూవీ డిసెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. అలాగే రెండు సినిమాల ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు