Anushka : బయటకు వస్తుందా ?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారిగా హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షో ఏ రేంజ్‌లో క్లిక్ అయిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఓవైపు సినిమాల్లో, మ‌రో వైపు రాజ‌కీయాల్లో గ‌ర్జించే బాల‌య్య టాక్ షోలో మాత్రం చాలా స‌ర‌దాగా న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అల‌రిస్తున్నారు. ఇక త‌న‌దైన కామెడీ టైమింగ్స్‌తో వ‌చ్చిన గెస్ట్‌ల‌ను తిక‌మ‌క పెడుతూ న‌వ్వులు పూయించారు బాల‌కృష్ణ‌.

అన్‌స్టాప‌బుల్ తొలి సీజ‌న్ పూర్త‌యిన త‌రువాత సీజ‌న్ 2 ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ట‌. సీజ‌న్ 1లో చాలా మంది సెలెబ్రిటీలు హాజ‌రై బాల‌య్య‌తో సంద‌డి చేసిన విష‌యం విధిత‌మే. అల్లుఅర్జున్‌, మ‌హేష్‌బాబు లాంటి స్టార్ హీరోల‌తో త‌న‌దైన స్టైల్‌లో న‌వ్వులు పూయించారు. సీజ‌న్‌2కి గెస్ట్‌లుగా ఎవ‌రు వ‌స్తార‌న్న‌ది చాలా ఆస‌క్తిక‌రంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రానున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ వ‌ంటి స్టార్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. తాజాగా గెస్ట్ గా వ‌చ్చే వారిలో మ‌రో పేరు వినిపిస్తోంది.

అందాల భామ అనుష్క శెట్టి గెస్ట్‌గా రానుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం అనుష్క న‌వీన్ పొలిశెట్టి హీరోగా చేస్తున్న సినిమాలో న‌టిస్తోంది. యూవీ క్రియేష‌న్స్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో అనుష్క సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో బాల‌య్య షోకు వ‌స్తుందా రాదా అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో వాస్త‌వం ఎంత ఉందో అనేది చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు