Ori Devuda : వెంకీ మామ సూపర్ లుక్

విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్నతాజా చిత్రం ఓరి దేవుడా. అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని రోజులు ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకి మామ నటిస్తున్నట్లు కూడా వినిపించింది.

ఈ విష‌యాన్ని మేక‌ర్స్ స్ట‌న్నింగ్ గ్లింప్స్‌తో అధికారికంగా ధృవీక‌రించారు. గ్లింప్స్‌ను చూస్తే, కూల్‌, స్టైలిష్ లుక్ లో క‌న‌ప‌డే దేవుడు పాత్రలో వెంక‌టేష్ కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే చుట్టూ పుస్త‌కాలు, సీతాకోకచిలుక‌ల మ‌ధ్య హీరో విశ్వ‌క్ సేన్ క‌నిపించారు. అలాగే కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా కనిపించాడు. అయితే ప్రతి సినిమాలో వెంక‌టేష్ కు ఒక మేన‌రిజ‌మ్ ఉంటుంది. ఆ మేన‌రిజ‌మ్‌ ఈ సినిమా గ్లింప్స్ లో కూడా చూపించారు.

ఓరి దేవుడా చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ గ్లింప్స్ తో పాటు మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. దీపావ‌ళి కానుకగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు