ప్రస్తుత రోజుల్లో ఓటీటీలకు సినీ లవర్స్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సినవరం లేదు. సినిమాలను థియేటర్స్ లో చూసినా, తిరిగి ఓటీటీల్లో రిలీజ్ అయ్యాక, మళ్లీ చూస్తున్నారు. మరి కొందరు, నెల రోజుల్లో ఓటీటీల్లోకి వస్తాయిలే, అని థియేటర్ లకు వెళ్లడమే మానేశారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ సబ్ స్కైబ్ చేసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి.
మార్చి 24న థియేటర్స్ లో రిలీజ్ అయి, బాక్సాఫీస్ ను షేక్ చేసిన “ఆర్ఆర్ఆర్” మూవీ 20న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీని, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇటవలే 50 రోజులను పూర్తి చేసుకుని, 1,150 కోట్లుకు పైగా వసూళ్లు చేసింది.
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి మల్టీ స్టారర్ గా నటించిన “ఆచార్య” అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 20నే అందుబాటులోకి రానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ, ఏప్రిల్ 29 థియేటర్స్ రిలీజ్ అయింది. థియేటర్స్ లో ఆకట్టుకోలేని ఈ మూవీ, ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.
మే6న థియేటర్స్ లో రిలీజైన “భళా తందనాన”, రెండు వారాల్లోనే ఓటీటీ బాట పట్టింది. ఈ నెల 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. చైతన్య దొంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో యుంగ్ హీరో శ్రి విష్ణు నటించాడు.
మలయాళ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, దృశ్యం ఫేం జీతూ జోసఫ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ “12th మ్యాన్”. ఈ మూవీని ఈ నెల 20న నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో “పంచాయత్ సీజన్ 2” ను మే 20నే రిలీజ్ చేస్తున్నారు. “పంచాయత్ సీజన్ 1” కు మంచి టాక్ రావడంతో సీక్వెల్ వెబ్ సిరీస్ ను తెరక్కించారు.
వీటితో పాటు ఈ నెల 20నే “ఎస్కేప్ లైవ్, జాంబీవ్లీ” సినిమాలతో పాటు “నైట్ స్కై సీజన్ 1” వెబ్ సిరీస్ విడుదల కానుంది. మే 16న నెట్ ఫ్లిక్స్ లో “ది ఇన్విజబుల్ మ్యాన్, ది హంట్” ప్రసారం కానున్నాయి. అలాగే “వూ కిల్డ్ సారా సీజన్ 3” మే 18 నుండి నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి రానుంది.