Anil Ravipudi : రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి నిలబడతాడా?

అప్పట్లో దాసరి నారాయణ రావు గారు.. దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించినప్పటి నుండీ వరుసగా 15 సినిమాలు హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కె.రాఘవేంద్ర రావు గారు దర్శకుడిగా మారిన తర్వాత వరుసగా 8 సినిమాలు హిట్లు కొట్టి 9వ సినిమాతో ప్లాప్ ను మూటకట్టుకున్నారు.

అప్పటి నుండీ ఇప్పటి వరకు దాసరి నారాయణ రావుగారి రికార్డ్ అలాగే ఉంది. దానిని రాజమౌళి మాత్రమే బ్రేక్ చేయగలడు అని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలు హిట్లు కొట్టాడు. ఇంకో 3 హిట్లు కొట్టాలి అంటే 2030 వచ్చేస్తుంది.

అయితే రాజమౌళి తర్వాతి ప్లేస్ లో కొరటాల శివ ఉండేవాడు. తర్వాత అనిల్ రావిపూడి కూడా జాయిన్ అయ్యాడు. ఇటీవల ‘ఆచార్య’ తో కొరటాల కూడా డిజాస్టర్ ను చవిచూశాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక్కడే మిగిలాడు. ‘ఎఫ్3’ తో అనిల్ రావిపూడి అయినా హిట్టు కొడతాడా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతాడా లేక చతికిలపడిపోతాడా? అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి.

- Advertisement -

‘ఎఫ్3’ ట్రైలర్ మరియు ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే హిట్టు లక్షణాలు కనిపించడం లేదు. ఒకవేళ హిట్ అయితే అనిల్ రావిపూడి నిలబడిపోతాడు. దాసరి గారి రికార్డ్ అతను కూడా అందుకునే అవకాశాలు ఉంటాయి. లేదంటే రాజమౌళిని నమ్ముకుని ఎదురుచూడాల్సిందే..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు