‘ఓకే ఓకే’ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమయ్యాడు ఉదయనిధి స్టాలిన్. తర్వాత ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి కానీ అవి అంతగా సక్సెస్ కాలేదు. దాంతో ఇక్కడి జనాలు ఈయన్ని చాలా వరకు మర్చిపోయారు.
అలాంటి సమయంలో ఉదయనిధి స్టాలిన్ పై వివాదస్పద నటి శ్రీ రెడ్డి, తనతో స్టాలిన్ ఏకంతంగా కలిశాడని, ఆ రోజులు తాను మర్చిపోనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయనిధి స్టాలిన్ ను తనకు కోలీవుడ్ హీరో విశాల్ పరిచయం చేశాడని కూడా చెప్పింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ వార్తల్లో నిలిచాడు.
Read More: Pawan kalyan : ఒరిజినల్ గ్యాంగ్స్టార్లో గ్యాంగ్ లీడర్ హీరోయిన్ !
సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఉదయనిధి స్టాలిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నెంజుకు నీధి’ మే 20న విడుదల కాబోతుంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘ఆర్టికల్ 15’ మూవీకి ఇది రీమేక్.దీంతో పాటు మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో ‘మామన్నన్’ అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు వంటి స్టార్ కూడా నటిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో..’మామన్నన్’ తన చివరి సినిమా అని చెప్పుకొచ్చాడు. ఓ పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు అతను బ్యాలెన్స్ చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఉదయనిధి స్టాలిన్ తండ్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడని అందరికీ తెలిసిన సంగతే.
Read More: బాలీవుడ్ గురించి నేను అలా అనలేదంటున్న మహేష్ బాబు..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...