Mahesh Babu: ప్రముఖ ఛానల్ ను టార్గెట్ చేసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్

పది మైనస్ ఒకటి ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఛానల్ కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో చాలామంది యంగ్ హీరోస్ గట్టిగా చురకలు అంటించిన విషయం కూడా మనకు తెలిసిందే. సినిమా ప్రముఖులను తమ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం వీళ్లకు ఉన్న పెద్ద అలవాటు. టీఆర్పీ కోసం ఏమైనా చెయ్యడానికి వెనకాడని ఛానల్ ఏదైనా ఉంది అంటే అది పది మైనస్ ఒకటి ఛానలే.

ఒక ప్రముఖ నటి చనిపోతే
బాత్రూమ్ టబ్ లో పడుకుని వార్తలు చెప్పడం.
అక్కడెక్కడో యుద్ధం జరిగితే
ఇక్కడ యాంకర్ ముఖం మీద బాంబ్ పేలడం.
ఒక హీరో కి బైక్ యాక్సిడెంట్ జరిగితే
బైక్ మోడల్ మీద కధనాలు నడపడం.
ఇలాంటివన్నీ ఈ ఛానల్ లోనే కనిపిస్తాయి.

రీసెంట్ గా రిలీజైన “సర్కారు వారి పాట” సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. సూపర్ స్టార్ యాంటీ ఫ్యాన్స్ మహేష్ ను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్ లో మహేష్ ను ట్రోల్ చేస్తూ కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. వీటిని ఆ ప్రముఖ ఛానల్ ప్లే చేస్తూ తమకున్న వేల్యూ ను తగ్గించుకుంది. ఇప్పుడు ఆ ఛానెల్ పై ప్రతీకారంగా మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో తీవ్ర వ్యతిరేకతను చూపిస్తూ, ట్రేండింగ్ లోకి తీసుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు