Salaar : సలార్ రిలీజ్ అప్పుడేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ సలార్. బాహుబలి-2 సినిమా తర్వాత డార్లింగ్ సాలిడ్ హిట్ అందుకోలేదు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపర్చాయి. దీంతో ప్రభాస్ హిట్ కోసం ఐదేళ్ల నుండి వెయిట్ చేస్తున్నారు. కేజీఎఫ్ – 2 భారీ విజయంతో సూపర్ ఫామ్ లో ఉన్న ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ “సలార్” మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

చిత్ర సీమకు కేజీఎఫ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో, ఈ ప్రాజెక్ట్ పై డార్లింగ్ ఫ్యాన్స్ భారీ అంచానలు పెట్టుకున్నారు. ఐదేళ్ల తర్వాత తమ హీరోకు సాలిడ్ హిట్ పడుతుందని అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కేజీఎఫ్-2 కు సీక్వెల్ గా కేజీఎఫ్-3 మూవీ వస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ను కూడా స్టార్ట్ చేస్తున్నట్టు కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఫౌండర్ విజయ్‌ కిరగందుర్‌ ప్రకటించాడు.

సలార్ మూవీ షూటింగ్ పూర్తి కాకుండానే, కేజీఎఫ్ – 3 షూటింగ్ ఎలా స్టార్ట్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ డైలామోలో పడ్డారు. కానీ, డార్లింగ్ అభిమానులకు సలార్ నిర్మాత గుడ్ న్యూస్ చెప్పారు.

- Advertisement -

సలార్ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 30 – 35 శాతం పూర్తి అయిందని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ వరకు సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, 2023 సమ్మర్ లో సలార్ ను రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అనుకున్న దానికి కంటే ముందే సలార్ సినిమా రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు