టాలీవుడ్ స్టార్ కామెడియన్ సునీల్, బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘వాంటెడ్ పండుగాడ్’ ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్, బ్రహ్మానందం, రఘుబాబు,షకలక శంకర్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా, ఆదివారం అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీ నుండి అనసూయ ఫస్ట్ లుక్‌తో పాటు ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Read More: Pooja hegde: ఇఫ్తార్ లో బుట్టబొమ్మ అందాల విందు !
ఈ వీడియోలో బుల్లితెర యాంకర్ అనసూయ గ్లామర్ షోతో అదరగొట్టింది. యూత్ ఆకట్టుకునేలా ఈ వీడియోను ప్రజెంట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మారేడుమిల్లిలో పూర్తి అయింది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మూడు, నాలుగు రోజుల్లో గుమ్మడికాయ కొట్టి, సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
Read More: Rashmika : విజయ్ దేవరకొండతో సినిమా మిస్ చేసుకున్నసాయి పల్లవి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...