వయసు అయిపోయినా సినిమా యాక్టర్స్ అంతా రాజకీయ నాయకులు అయిపోయినట్లు,
ఫెయిల్ అయిపోయిన ప్రేమికులు అంతా ఫ్రెండ్స్ కాలేరు అని రాసారు త్రివిక్రమ్ చిరునవ్వుతో సినిమాలో.
సినిమాలకి , రాజీకీయాలకి ఒక అవినాభావ సంబంధం ఉంది.
మాములుగా సినిమా కెరియర్ చివర దశలో చాలామంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు. కానీ తన కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ కు వైసీపీ పార్టీ నుంచి ఉన్న వ్యతిరేకత మనకు తెలియంది కాదు, అలానే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు అంటించిన చురకలూ మనకు తెలియనివి కావు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త జీవో పాస్ అవుతుంది.
భీమ్లా నాయక్ సినిమాకి వచ్చిన అడ్డంకులు అన్ని, ఇన్ని కావు.
ఎట్టకేలకో ఆ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది.
భీమ్లా నాయక్ సినిమాలో “ప్రతి శుక్రవారం వచ్చి సంతకం పెట్టిపో’ అని రానాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వైసీపీ నేతలకు ఎక్కడో కాలింది. వాళ్ళు భీమ్లా నాయక్ సినిమాను టార్గెట్ చేసి ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. రీసెంట్ గా రిలీజైన “సర్కారు వారి పాట” సినిమాలో “నేను ఉన్నాను నేను విన్నాను” అనే డైలాగ్ పెట్టడం , దానికి తోడు నేను వైస్ రాజశేఖర్ రెడ్డి గారికి అభిమానిని అని దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం వలన, ఈ సినిమాను టీడీపీ వాళ్ళు టార్గెట్ చెయ్యడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఈ పాలిటిక్స్ వలన సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళు కొంచెం దూరంగా ఉండటం బెటర్ అనేది చాలామంది అభిప్రాయం.