‘ఆర్ ఆర్ ఆర్’ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడే ఆ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది.ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రొమోషన్ల టైంలో కూడా ఎన్టీఆర్ ఈ రెండు సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడేవాడు.
అయితే తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో కూడా ఎన్టీఆర్ సినిమా చేయడానికి ఓకె చెప్పినట్టు కథనాలు వినిపించాయి.అయితే ఇప్పుడు కొరటాల శివ కంటే ప్రశాంత్ నీల్ సినిమా పైనే ఎన్టీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ‘ఆచార్య’కంటే ‘కేజీఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ అయ్యింది.దీంతో ఎన్టీఆర్ ఆలోచనల్లో మార్పు వచ్చింది.
Read More: Hit 2 : ముందే ఊహించాం
అయితే ‘కేజీఎఫ్ 2’ నిర్మాత ఎన్టీఆర్ గాలి తీసేశాడనే చెప్పాలి.ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్నాడు. ఇది పూర్తి అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది అని అంతా అనుకున్నారు.కానీ ‘సలార్’ షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత ‘కేజీఎఫ్ 3’ లాంచ్ చేస్తాం. 2024లో కేజీఎఫ్ 3ని విడుదల చేస్తాం. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ఆ రకంగా చూస్తే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు. కాబట్టి ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా ఓకే చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
Read More: Meera Jasmine : సెకండ్ ఇన్సింగ్స్ కు ప్లాన్స్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...