Friday OTT Movies : ఈవారం స్ట్రీమింగ్ కు సూపర్ హిట్ మూవీస్ రెడీ… ఏ ఓటిటిలో ఏ మూవీ వస్తుందంటే?

Friday OTT Movies : ప్రతీ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతాయి అన్న విషయం తెలిసిందే. తాజాగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాలతో పాటు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి ఓటీటీలు. ఇక ఎప్పటిలాగే ఈ వారం 18 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండగా, అందులో 3 మాత్రం మోస్ట్ అవైటింగ్ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

ముందుగా ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల్లో యామి గౌతమ్ హీరోయిన్ గా నటించిన కాంట్రవర్సీ మూవీ ఆర్టికల్ 370 గురించి చెప్పుకోవాలి. థియేటర్లలో ఫరవాలేదు అనిపించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి చాలామంది కాంట్రవర్సీ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సైరన్ మూవీ గురించి కీర్తి సురేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హాలీవుడ్ సినిమాలను బాగా ఇష్టపడే మూవీ లవర్స్ కు ఈ వారం డ్యూన్ పార్ట్ 2 బెస్ట్ ఛాయిస్ కాబోతోంది. ఏప్రిల్ మూడో వారంలో వీటితో పాటే పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు స్ట్రిమింగ్ కాబోతున్నాయి.

1. డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఏప్రిల్ 17న ది సీక్రెట్ స్కోర్, సి యు ఇన్ అనదర్ లైఫ్ అనే స్పానిష్ వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్ 19న చీఫ్ డిటెక్టివ్ 1958 అనే కొరియన్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇక సైరన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

- Advertisement -

2. జీ 5

ఏప్రిల్ 16న సైలెన్స్ 2: ది నైల్ అవుట్ బార్ షూట్ అవుట్, ఏప్రిల్ 19న డిమోన్, కం చాలు హై అనే హిందీ సినిమాలు ఇందులో ప్రసారం కాబోతున్నాయి.

3. జియో సినిమా

ఏప్రిల్ 19న జియో సినిమాలో ఓర్లాండో బ్లూమ్ : టూ ది ఎడ్జ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇక మోస్ట్ అవెయిటింగ్ హిందీ మూవీ ఆర్టికల్ 370 కూడా అదే రోజున స్ట్రీమింగ్ కాబోతోంది.

4. బుక్ మై షో

ఏప్రిల్ 16 నుంచి బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ డ్యూన్ పార్ట్ 2 బుక్ మై షోలో అందుబాటులో ఉంటుంది. ఈ మూవీను గురించి చాలా రోజుల నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు హాలీవుడ్ మూవీ లవర్స్.

5. సోనీ లివ్

ఇందులో ఏప్రిల్ 15 నుంచి క్విజ్జర్ ఆఫ్ ది ఇయర్ వెబ్ సిరీస్ కొత్తగా స్ట్రీమింగ్ అవుతోంది.

6. నెట్ ఫ్లిక్స్

ఏప్రిల్ 17 నుంచి ది గ్రిమ్ వేరియేషన్స్ అనే జపనీస్ వెబ్ సిరీస్, అబౌట్ లివింగ్ వరల్డ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్, రెబల్ మూన్ ది స్కార్గివర్ పార్ట్ 2అనే ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు