Tillu Square: టిల్లు వసూళ్ల జోరు.. మరో ల్యాండ్‍మార్క్ దాటిన కలెక్షన్లు

Tillu Square Box office Collections: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని హిట్ అవుతే మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో క్రైమ్… కామెడీ, హారర్, స్కాం నేపథ్యంలో వచ్చిన సినిమాలు బంపర్ హిట్ అవుతున్నాయి. ఆ సినిమాలకు జనాల్లో మంచి ఆదరణ వస్తోంది. ఏ ఒక్కరూ చూసినా… అలాంటి సినిమాలు మాత్రమే చూడాలని ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. అయితే వీటన్నిటిని కొంతమంది దర్శకులు గుర్తించకుండా… ఏదో చేసామా వెళ్ళిపోయామా అన్నట్లు చేస్తున్నారు.

కానీ కొంతమంది దర్శకులు అలాగే హీరోలు చాలా కష్టపడి మంచి సినిమాలు తీసుకువస్తున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కొడుతున్నారు. అచ్చం అలాగే ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా బంపర్ హిట్ అయింది. గత రెండు సంవత్సరాల కిందట ఎలాంటి అంచనాలు లేకుండా డీజే టిల్లు సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా… హీరోయిన్ గా నేహా నటించి అందర్నీ కనువిందు చేసింది.

క్రైమ్, కామెడీ అలాగే లవ్ స్టోరీ మూడు కలిపి ఈ సినిమాలో చూపించారు. దీనికి తోడు తెలంగాణ యాస భాష ఈ సినిమాలో స్పష్టంగా కనిపించింది. ఇంకేముంది యూత్ ను బాగా ఆకట్టుకుంది డీజే టిల్లు సినిమా. అప్పట్లోనే ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టగలిగింది. అయితే ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఈ మధ్యకాలంలోనే టిల్లు స్క్వేర్ పేరుతో మళ్లీ ఈ సినిమా సీక్వెల్ వచ్చింది.

- Advertisement -

ఈ సినిమాలో ఎప్పటిలాగానే డిజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు బిగ్ క్రిస్టి ఇచ్చారు. హీరోయిన్ నేహాను పక్కకు పెట్టేశారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా మారిపోయిన అనుపమ పరమేశ్వరన్ ను ఫిక్స్ చేసి బర్రిలోకి దింపారు. దీంతో ఈ సినిమా కూడా బంపర్ హిట్ అయింది. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా… ఇప్పటికి కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా టిల్లు స్క్వేర్ సినిమా మరో రికార్డు సృష్టించింది. సిద్దు జొన్నలగడ్డ మరియు అనుపమ పరమేశ్వర జంటగా నటించిన ఈ టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద ఇంకా దుమ్ము లేపుతుంది. ఆరంభం నుంచే రికార్డు కలెక్షన్లను సాధిస్తూ మరో ఘనత అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు ఏకంగా 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో చిత్ర బృంద సభ్యులందరూ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఇక ముందు ముందు కూడా ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు రాబట్ట గలుగుతుందని చిత్ర బృందం భావించింది. అటు ఓటిటి రైట్స్ కూడా భారీ ధరకు వెళ్లినట్లు సమాచారం అందుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు