Dunki : అప్పుడే ఓటీటీలో “డంకీ”… ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

బాలీవుడ్ బాద్ షా ర్ ఖాన్ నటించిన కొత్త మూవీ “డంకీ”ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే అప్పుడే ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది? ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయంపై చర్చ నడుస్తుంది. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో రాబోతోంది? ఓటిటి ప్లాట్ఫారంపై “డంకీ”నీ చూడొచ్చు అనే వివరాల్లోకి వెళితే…

పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అదే జోష్ తో చేసిన “డంకీ” సినిమాతో డిసెంబర్ 21న థియేటర్లలో సందడి చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు షారుక్. ఇక బాలీవుడ్ లోని మేటి దర్శకుల్లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ “డంకీ” సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడం, షారుక్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడంతో అంచనాలు పీక్స్ కు వెళ్ళిపోయాయి.

మరోవైపు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న “సలార్” మూవీకి ఒకరోజు ముందు “డంకీ” రావడంతో ఈ క్రిస్మస్ కు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్లాష్ నెలకొంది. ఎలాగైతేనే అనుకున్న విధంగా షారుక్ “డంకీ” అనుకున్న సమయానికి థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే “డంకీ” మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఇక “డంకీ” మూవీ ఇండియన్ ఓటిటి ప్లాట్ఫామ్ జియో సినిమాలో రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా జరిగిన ఈవెంట్లో జియో స్టూడియోస్ వారు తమ ఓటీపీ ప్లాట్ ఫామ్ లో రాబోతున్న సినిమాలు, సిరీస్ లకు సంబంధించిన జాబితాను ఆవిష్కరించారు. అందులో “డంకీ” సినిమా కూడా ఉండడంతో షారుక్ మూవీ ప్రసారం ఏ ఓటిటిలో ప్రసారం కాబోతోంది అన్న విషయం పై క్లారిటీ వచ్చింది. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలన్నింటిని అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి పాపులర్ ఓటీటీ సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి.

కానీ “డంకీ” రైట్స్ ను మాత్రం జియో సినిమా సొంతం చేసుకుంది. “డంకీ” మూవీ ని జియో సినిమా 155 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వచ్చే టాక్ ను, కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని “డంకీ” ఓటిపి రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. సాధారణంగా ఏ సినిమా నైనా థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటిటిలో విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఈ లెక్కను గనుక పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా, లేదంటే రిపబ్లిక్ డే సందర్భంగా “డంకీ”ని ఓటిటిలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు