Dunki Talk : “సలార్”కు రూట్ క్లియర్… చెత్త రాజకీయాలు చేస్తే ఇదే గతి

2023లో బాక్స్ ఆఫీస్ వద్ద జరిగిన బిగ్గెస్ట్ క్లాష్ అనగానే “సలార్”, “డంకి” సినిమాలు గుర్తుకొస్తాయి. కేవలం ఒక్కరోజు గ్యాప్ తో ఈ సినిమాలు రెండు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన “డంకీ” మూవీ ఈరోజు అంటే డిసెంబర్ 21న థియేటర్లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సినిమాకు నడుస్తున్న టాక్ చూస్తుంటే “సలార్” మూవీకి రూట్ క్లియర్ అయినట్టుగానే కనిపిస్తోంది.

“డంకి” మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ విమర్శకులు మాత్రం రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాను తెరకెక్కించిన తీరుపై పెదవి విరుస్తున్నారు. గతంలో డైరెక్టర్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్, త్రీ ఇడియట్స్, పీకే మంటి చిత్రాలను చూస్తే హిరానీ మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. కానీ “డంకీ” విషయానికి వస్తే హిరానీ స్టైల్ మార్క్ మిస్సయింది. సాధారణంగా సింపుల్ స్టోరీని తీసుకుని తనదైన శైలిలో కామెడీ, ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్ వంటి అంశాలను కలగలిపి ప్రేక్షకులను మెప్పించే హిరానీ “డంకీ” విషయంలో మాత్రం అలా చేయకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

కొన్నిచోట్ల కామెడీ వర్క్ అవుట్ అయినప్పటికీ ఎమోషన్స్ అంతగా ఆకట్టుకోవు అన్నది విమర్శకుల అభిప్రాయం. ఎమోషన్స్ ను బలవంతంగా ప్రేక్షకులపై రుద్దడం, సీన్స్ ఆసక్తికరంగా లేకపోవడమే మైనస్ అని, క్లైమాక్స్ సాగదీసారని, మామూలుగా ఇరానీ సినిమాల్లో ఉండే కోర్ ఎమోషనల్ పాయింట్ మిస్ అయ్యిందని, సాంకేతిక, నిర్మాణ విలువలు ఏమంత బాగాలేవని, విఎఫ్ఎక్స్ కూడా వర్కౌట్ కాలేదని అంటున్నారు. దీంతో మొత్తానికి షారుక్ ఖాన్ కు హ్యాట్రిక్ మిస్ అయినట్టే అని టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే నార్త్ లో “సలార్” మూవీకి థియేటర్లను ఇచ్చే విషయంలో కొంతమంది అడ్డు పడుతున్నారు అనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో షారుక్ ఖాన్ హస్తం కూడా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాత్రికి రాత్రి “సలార్” థియేటర్లను “డంకీ”కి అప్పజెప్పి ప్లేటు ఫిరాయించిన పివిఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్స్ యాజమాన్యానికి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది “సలార్” టీం.

సౌత్ లో ఉన్న ఆ థియేటర్లలో “సలార్’ సినిమాను రిలీజ్ చేయకూడదని చిత్ర బృందం డిసైడ్ అయింది. ఇక ఇప్పుడు “డంకీ” సినిమాకు ప్రస్తుతం నడుస్తున్న మిక్స్డ్ టాక్ చూసి “సలార్” విషయంలో అలాంటి చెత్త రాజకీయాలు చేసినందుకు ఇలాంటి గతి పట్టింది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు