చిన్న చిన్న సినిమాలతో కోలీవుడ్ కు పరిచయమైన శివ కార్తికేయన్, తక్కువ సమయంలోనే హీరోగా ఎదిగాడు. ‘రెమో’ ‘శక్తి’ ‘సీమ రాజా’ ‘వరుణ్ డాక్టర్’ సినిమాలు తెలుగులోకి డబ్ కావడంతో, తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల శివ కార్తికేయన్ డాన్ సినిమా తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ తొలి రోజు నుండే పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది.
రిలీజైన ఐదు రోజుల్లో ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కాగా, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్పుడే టాక్ స్టార్ట్ అయింది. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా థియేటర్స్ లో విడుదల అయ్యాక, ఓటీటీలోకి రావాల్సిందే. ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఓటీటీల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి.
శివ కార్తికేయన్ డాన్ మూవీని కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీల్లో రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుందట. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో వచ్చే నెల 10వ తేదీ నుండీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.