తెలుగు ప్రేక్షకులు హీరోతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉంటే చాలు ఆ సినిమాలకి బ్రహ్మరథం పడుతుంటారు. అందుకే తమిళ హీరోలు కూడా తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. రజినీ కాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్, విశాల్ వంటి కోలీవుడ్ హీరోలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ నెలకొంది. మెల్లగా శివ కార్తికేయన్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ కాబోతున్నాడని స్పష్టమవుతుంది.
‘రెమో’ ‘శక్తి’ ‘సీమ రాజా’ ‘వరుణ్ డాక్టర్’ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించాయి. అందుకే ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ‘ఏషియన్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ గ్యాప్ లో శివ కార్తికేయన్ ‘డాన్’ మూవీ రిలీజ్ అయ్యింది.
Read More: Katrina Kaif : హీరోయిన్ కాలేనని అన్నారు
తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ మూవీ మే 13న విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. 4 రోజులు పూర్తయ్యేసరికి తెలుగులో ‘డాన్’ మూవీ రూ.1.2 కోట్ల గ్రాస్ వసూళ్ళను నమోదు చేసింది. ఈ వీకెండ్ కూడా ‘సర్కారు వారి పాట’ ఉంది కాబట్టి పెద్ద సినిమాలు ఏవి విడుదల కాకపోవచ్చు. దాంతో ‘డాన్’ కు మరో వీకెండ్ కలిసొచ్చినట్టే. దాంతో తెలుగు దర్శకుడు అనుదీప్ తో శివ కార్తికేయన్ చేయబోయే మూవీకి తెలుగులో కూడా మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
Read More: Kriti Sanon : హద్దులు దాటకుండా నటించా..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...