Tollywood: ఈ వారమైనా నిఖార్సైన హిట్టు సినిమా వస్తుందా?

టాలీవుడ్ లో గత నెల రోజులుగా ఒక్క సినిమా హిట్ అవ్వలేదు. ఏప్రిల్ 21న విడుదలైన “విరూపాక్ష” బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా హిట్ అవలేదు. వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నా, భారీ హైప్ ఉన్న సినిమాలు వచ్చినా రోటీన్ కంటెంట్ తో ఉండడం వల్ల చాలా సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. “ఉగ్రం” సినిమాకు ఓ మోస్తరు గా మంచి టాక్ వచ్చినా ప్రమోషన్లలో విఫలం అవడంతో ఆ సినిమా కూడా ప్లాప్ గా మిగిలింది.

ఇక గత వరం వచ్చిన సినిమాల్లో “అన్ని మంచి శకునములే” ఎలాంటి అంచనాలు అందుకోలేక చతికిలపడగా, డబ్బింగ్ మూవీ బిచ్చగాడు2 మాత్రం హిట్ అయింది. కానీ ఆ సినిమా తెలుగు సినిమా కాదు. కాబట్టి తెలుగులో రాబోయే సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వారం మే26న నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో దాదాపుగా కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమాకే ఆడియన్స్ ఓటేసే అవకాశం ఉంది. ఆ సినిమాల్లో మొదట “మెన్ టూ” అనే సినిమా గురించి చెప్పుకుంటే నరేష్ అగత్స్య, మౌర్య, బ్రహ్మాజీ, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో కామెడీ డ్రామా గా వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఇక నరేష్, పవిత్రల రియల్ లైఫ్ స్టోరీ గా వస్తున్న కాంట్రావర్సీ చిత్రం “మళ్ళీ పెళ్లి” కూడా ఈ వారమే వస్తుంది. ట్రోలింగ్స్ ద్వారా హైప్ పెంచుకుంటూ వస్తున్న ఈ సినిమా ఎలా ఆడుతుందో తెలీదు. ఇక శుక్రవారం విడుదలవుతున్న మరో సినిమా “జైత్ర”. సన్నీ నవీన్, రోహిణి రాచెల్ హీరోయిన్లుగా అంతా కొత్తవారితో నిర్మించిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ట్రైలర్ చూస్తే చాలా బాగున్నా ఈసినిమాకు సరైన ప్రమోషన్లు మాత్రం చేయడం లేదు. అందువల్ల ఈ సినిమా టాక్ ని బట్టే ఆడుతుందా లేదా అని డిసైడ్ అవుతుంది.

- Advertisement -

ఇక మే 26 న అన్నిటికంటే ఎక్కువ హైప్ తో ఫుల్ లెన్త్ కామెడీ డ్రామా గా వస్తున్న సినిమా “మేం ఫేమస్“. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్ లో అంతా యూట్యూబ్ నటులతో విలేజ్ కామెడీ డ్రామా గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ముందునుండి వెరైటీ గా ప్రమోషన్లు చేస్తున్న ఈ చిత్ర యూనిట్ రీసెంట్ గా నానితో ట్రైలర్ ను లాంచ్ చేయించారు. విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంది. మరి విడుదలయ్యే ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో, టాలీవుడ్ కు మళ్ళీ హిట్ పడుతుందో లేదో తెలియాలంటే మే26 వరకు వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు