Nasha : హన్సికను డేట్‌ కు పిలిచింది సునిషితే !

దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ హన్సిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో వరుస సినిమా అవకాశాలను దక్కించుకొని, కోలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తమిళంలోనూ పెద్ద హీరోల సరసన నటించి మంచి పేరును తెచ్చుకుంది. దీంతో అక్కడ హన్సికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఏకంగా ఆమెకు గుడి కూడా కట్టారంటే తమిళ్ లో హన్సికకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమె ఇటీవలనే ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అమ్మడు సినిమా అవకాశాలు అందుకుంటుంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు షాకింగ్ విషయాలను బయట పెట్టిన విషయం తెలిసిందే. తనని ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడు అంటూ సంచలన విషయాలను బయటపెట్టింది. అంతేకాదు తనతో డేట్ కి రావాలంటూ ఆ హీరో వేదించాడని.. అతడి టార్చర్ భరించలేక ఆ హీరోకి తగిన విధంగా బుద్ధి చెప్పానని పేర్కొంది. అయితే ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక వెల్లడించలేదు. దీంతో ఆ హీరో ఎవరై ఉంటారని అందరిలో చర్చ మొదలైంది.

- Advertisement -

అయితే తాజాగా ఈ వివాదంలో తల దూర్చాడు స్వయం ప్రకటిత హీరో సునిషిత్. ఈ వింత మనిషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫలానా హీరో నా ఫ్రెండ్, ఫలానా హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్ అంటూ నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటాడు. ఇతను ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ గురించి కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా హన్సిక చేసిన ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా అతను ఓ పోస్ట్ చేస్తూ.. “హన్సిక మాట్లాడింది నా గురించే అని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. హన్సిక నాకు మంచి స్నేహితురాలు. ఇలాంటి చిల్లర రాతలతో శునకానందాన్ని పొందే వాళ్ళు మా బంధాన్ని విడదీయలేరు” అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఇతడు చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు