Venkat Prabhu :మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి !

టాలీవుడ్ లోకి చాలామంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే క్రేజ్ తెచ్చుకుంటారు. అలా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కృతిశెట్టి ఒకరు.

టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు జంటగా కృతి నటించిన, ఉప్పెన సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో కృతిశెట్టి స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఈ విజయంతో ఈ భామకు వరస అవకాశాలు క్యూ కట్టాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించింది.

అనంతరం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఉప్పెన సినిమా తర్వాత ఆ స్థాయిలో ఈ బ్యూటీకి హిట్ లేదు. తాజాగా నాగచైతన్య సరసన నటించిన ‘కస్టడీ’ సినిమా కూడా డిజాస్టర్ గా మారింది. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్న కృతికి కనీసం యావరేజ్ టాక్ కూడా దక్కలేదు. ఇకపోతే తాజాగా ఈ అమ్మడుకి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లో తలపతి విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉండగా, అందులో ఒకరిగా కృతిని ఎంచుకున్నట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు