Custody : సినిమాలకు అక్కినేని నాగచైతన్య గుడ్‌ బై..?

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య.. కెరీర్ మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలకు, కథలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు.

ఇక 2010లో ఏ మాయ చేసావే సినిమాలో నటించగా.. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 100% లవ్, దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, లవ్ స్టోరీ, మజిలీ, బంగార్రాజు వంటి చిత్రాలలో నటించగా.. ఇందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ నాగచైతన్య మాత్రం స్టార్ హీరో హోదాని అందుకోలేకపోయాడు.

ఇక 2017 అక్టోబర్ లో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోతున్నట్టు ప్రకటించి అందరిని షాక్ కి గురి చేశారు. ఇదిలా ఉంటే.. నాగచైతన్య ఇప్పటికీ స్టార్ హోదాను సంపాదించుకోకపోవడానికి కారణం నాగార్జునే అంటూ ఓ పుకారు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

- Advertisement -

నాగార్జున క్లాస్ సినిమాలు చేయమని చెప్పడం వల్లే నాగచైతన్య స్టార్ హీరో కాలేదంటూ ఓ రూమర్ తెగ వైరల్ అయింది. ఇక ఇటీవల కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగచైతన్యకి మరోసారి షాక్ తగిలింది. ఈ సినిమా కూడా ప్లాప్ కావడంతో నాగచైతన్య ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. మరో మూడు సినిమాల్లో నటించి ఇక పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు సమాచారం. అనంతరం బిజినెస్ వైపు అడుగులు వేయాలని నాగచైతన్య నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిజంగానే చైతు సినిమాలకు దూరం కాబోతున్నాడా..? అని అందరూ షాక్ కి గురవుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు