Pushpa2 : రాజమౌళి బన్నీతో ఎందుకు మూవీ చేయడం లేదు ?

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమా టేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. ఇక త్వరలోనే రాజమౌళి, మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాతోనే మహేష్ బాబు మొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో నటించబోతున్నాడు. అయితే ఇప్పటిదాకా రాజమౌళి దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. కానీ ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం రాజమౌళి సినిమా తీయలేదు. ఇందుకు గల కారణం మగధీర మూవీ సమయంలో నిర్మాత అల్లు అరవింద్, రాజమౌళి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయట. ‘మా’ వల్లే ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మితమైందని అల్లు అరవింద్ ప్రవర్తించిన తీరు రాజమౌళికి నచ్చలేదట.

అందుకే మగధీర విజయోత్సవ సభకు కూడా హాజరు కాలేదట. అందుకే అప్పటినుండి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కానీ, బన్నీతో కానీ సినిమా చేసేందుకు ముందుకు రాలేనని జక్కన్న తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని 2025 చివరి నాటికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు