Dasara :కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్… వరుడు బ్యాక్గ్రౌండ్ ఇదే !

కీర్తి సురేష్..ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్. ఇటీవల దసరా సినిమాతో కీర్తి సురేష్…. క్రేజ్ మరింత పెరిగింది. తెలుగులో మహానటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, నేషనల్ అవార్డు గ్రహీతగా మరింత పాపులారిటీ దక్కించుకున్న అయితే ఈమె ఇటీవల దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కీర్తి సురేష్ సినీ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తల్లి మేనక నటిగా మంచి పాపులారిటీ దప్పించుకుంది. ఇక ఈమె తండ్రి సురేష్ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. వీరి వారసత్వంతో ముందుగా మలయాళంలో నటిగా సినీ రంగప్రవేశం చేసిన కీర్తి సురేష్ ఆ తర్వాత కోలీవుడ్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అయితే గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తితో కీర్తి సురేష్ కలిసి ఉన్న ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా. అతనితో అత్యంత సన్నిహితంగా కీర్తి సురేష్ ఉన్న నేపథ్యంలో అతడు ఆమె లవర్ అని రూమర్స్ మొదలయ్యాయి ఇక ఆ వ్యక్తి విషయానికొస్తే అతడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన పేరు పర్హన్ బీన్ లియాకత్… కీర్తి సురేష్ ఇతనితో రిలేషన్ లో ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి వివాహం అంటూ కథనాలు వెలువడుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు