Siddu jonnalagadda :ఇదేందయ్యా సమంత.. ఆఖరికి ఆ హీరోతో కూడా..?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూత్ ఫుల్ కాన్సెప్ట్ లతో కుర్రకారును ఎంటర్టైన్ చేసే హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ముందు వరుసలో ఉంటారు. డిజె టిల్లు సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఇక ప్రస్తుతం కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన డీజే టిల్లు సీక్వెల్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్ టాలెంటెడ్ నటి సమంత గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించగలదు సమంత. త్వరలోనే సమంత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ – సమంతకి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్ మహిళా దర్శకురాలలో ఒకరైన నందిని రెడ్డి ప్రస్తుతం “అన్నీ మంచి శకునములే” అనే సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. ఈ సినిమా మే 18న (నేడు) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో దర్శకురాలు నందిని రెడ్డి తన తదుపరి సినిమాపై ఆసక్తికర విషయాన్ని తెలిపారు. తన తదుపరి సినిమా సిద్దు జొన్నలగడ్డతో తీయబోతున్నానని చెప్పారు. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ కు జంటగా సమంత నటించనున్నారని టాక్. గతంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత రెండు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక వీళ్లిద్దరి హ్యాట్రిక్ మూవీ గా ఇది రానుందని టాక్ వినిపిస్తుంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తిస్థాయి కామెడీ చిత్రంగా ఇది రానున్నట్లు సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు