Mahesh babu : NTR పరువు తీసిన సునిశిత్ !

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో… చాలామంది వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ హైలైట్ అవుతున్నారు. అలానే… సునిశిత్ అనే వ్యక్తి పాపులర్ అయ్యాడు. సాక్రిఫైజింగ్ స్టార్ గా సునిశిత్ పాపులర్ అయిన సునిశిత్ గురించి మామూలు వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ తెలుసు.

యూట్యూబ్ ఇంటర్యూ లలో సునిశిత్ సంచలన కామెంట్స్ చేస్తుంటారు. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ నన్ను బ్రతిమిలాడితేనే వాళ్లకు సినిమాలు వదిలేసానని… నా సినిమాలు వాళ్ళు చేశారని చెబుతాడు ఈ సునిశిత్. ఇక ఈ మధ్య ఇలాగే ఎక్స్ట్రాలు చేసి చరణ్ ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు తిన్నారు. ఇక ఈ సంఘటన మరువకముందే మరో వివాదానికి తెరలేపాడు సునిశిత్.

తాజాగా ఓ ఇంటర్యూ లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సునిశిత్. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అందులో సునిశిత్ మాట్లాడుతూ ‘జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో కానీ.. ఆయన పోర్న్ సినిమాలు చేశాడు. ఈ విషయం టాలీవుడ్ లో సునిశిత్ అనే హీరో తప్ప ఎవరూ చెప్పరు’ అని చెప్పుకొచ్చారు సునిశిత్. ఈ ఇంటర్యూలో కేవలం తారక్ పైనే కాకుండా టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీల మీద కూడా ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మానందంపై మర్డర్ కేసు ఉంది. ప్రభాస్, మంచు లక్ష్మిల మీద రేప్ కేసులు ఉన్నాయి.హీరోయిజం చూపించే వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు. మహేష్ బాబును డిఫేమ్ చేస్తున్నానని వాళ్ళబ్బాయి గౌతమ్ నాతో గొడవ పడ్డారని కూడా సంచలన వాక్యాలు చేశాడు సునిశిత్. ఇక ఈ కామెంట్స్ విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు