Mehreen Pirzada: మెహరీన్ మరీ ఇలా అయిపోయిందేంటి..?

కృష్ణ గాడి వీరప్రేమ గాధ సినిమా ద్వారా తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది పంజాబీ భామ మెహరీన్.బొద్దుగా ముద్దుగా ఉండటం వల్ల తెలుగు ఆడియెన్స్ ఒక్క సినిమాతోనే మెహరీన్ ని ఓన్ చేసుకొన్నారు. అయితే కొన్ని సినిమాల తర్వాత మెహరీన్లో మార్పు వచ్చింది. కారణం ఏంటో తెలీదు గానీ, మెహరీన్ సన్నబడటం మొదలు పెట్టింది. బొద్దుగా ఉన్నప్పుడు భలే భలే మగాడివోయ్, రాజా ది గ్రేట్ వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న మెహరీన్ సన్నబడ్డాక హిట్స్ లేకపోవటం వల్ల అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ఎఫ్2 వంటి హిట్స్ ఉన్నప్పటికీ ఆ సినిమాల్లో మెహరీన్ నటన, ఫిజిక్ మీద విమర్శలొచ్చాయి.

మెహరీన్ నటించిన లాస్ట్ సినిమా ఎఫ్3 తర్వాత వేరే ఏ సినిమాలో కనిపించలేదు. ఈ క్రమంలో ఇటీవల మెహరీన్ పోస్ట్ చేసిన తన లేటెస్ట్ ఫోటోస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. అసలే సన్నబడ్డ మెహరీన్, ఇప్పుడు ఇంకా సన్నబడి జీరో సైజ్ కి వచ్చేసి అందరికీ షాక్ ఇచ్చింది. జీరో సైజుకి మారటం కోసమే ఇంత గ్యాప్ తీసుకుందా అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొంత మంది నెటిజన్స్ మెహరీన్ కి ఏదైనా వ్యాధి ఉందా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు మెహరీన్ ఎలా ఉన్నా బాగుంటుందంటూ తన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మెహరీన్ చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్ ఒక్కటి కూడా లేదు, ఈ కారణంగానే మెహరీన్ జీరో సైజ్ కి వచ్చేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అప్పట్లో జీరో సైజ్ కి ఉన్న క్రేజ్ ఇప్పుడు లేకపోవటంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండటం వల్ల ఈ జెనరేషన్ హీరోయిన్లు జీరో సైజ్ మెయింటైన్ చేయటానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో రిస్క్ చేస్తున్న మెహరీన్ కి ఇప్పుడైనా మంచి ఆఫర్లు వస్తాయో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు