Shobita: నాగచైతన్యతో రిలేషన్ – నిజం బయటపెట్టిన శోభిత..!

శోభిత ధూళిపాల గత కొంత కాలంగా తరచూ వార్తల్లో వినిపిస్తున్న పేరు. గూఢచారి సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన శోభిత నాగచైతన్యతో  డేటింగ్ చేస్తోందంటూ చాలా కాలంగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య శోభితతో డేటింగ్ అంటూ వస్తున్న రూమర్స్ ని ఖండించాడు. తమకి సంబంధం లేని మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయటం దారుణమని, సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే తనకు సమంతకి మధ్య మనస్పర్థలు వచ్చాయని అన్నాడు. ఎప్పడూ లేనిది రూమర్స్ పై నాగ చైతన్య స్పందించటంతో ఇద్దరి డేటింగ్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది.

నాగచైతన్యతో డేటింగ్ వ్యవహారం గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన శోభిత, అది తనకు సంబంధం లేని విషయం అని ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ లాంటి దిగ్గజాలతో పని చేశానన్న అద్భుతమైన ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఎవరో ఎదో అన్నారని ఏడుస్తూ కూర్చోనని సమాధానం ఇచ్చింది.

అయితే, సోషల్ మీడియాలో మాత్రం టాక్ వేరే రకంగా ఉంది, డేటింగ్ లాంటిది ఏమీ లేదంటూ ఇద్దరు క్లారిటీ ఇచ్చినప్పటికీ గతంలో చైతు, శోభిత కలిసున్న ఫోటోలు వైరల్ అవ్వటం వల్ల కచ్చితంగా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అంటున్నారు. సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయం నుండి వస్తున్న ఈ రూమర్స్ కి ఎప్పుడు ఎలా స్వస్తి పలుకుతారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు