Snigdha : బాల్యంలోనే రే** కి గురయ్యా – స్నిగ్ధ..

Snigdha : కోలుకోవడానికి పదేళ్లు పట్టింది..

పేరుకే అమ్మాయి.. కటౌట్ చూస్తే మాత్రం అబ్బాయిని తలపిస్తుంది.. తన అద్భుతమైన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న ప్రముఖ నటి స్నిగ్ధ అందరికీ పరిచయమే.. 2011లో లేడీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ అలా మొదలైంది’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్నిగ్ధ ఇందులో పింకీ పాత్రలో నాని, నిత్యామీనన్ లకు ఫ్రెండ్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అబ్బాయిలా ఫ్యాంట్ , షర్ట్ ధరించి అందరిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. మేం వయసుకు వచ్చాం, దమ్ము , రొటీన్ లవ్ స్టోరీ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది.

నా బాల్యం మొత్తం భయంతోనే గడిచిపోయింది..

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధ (snigdha ) తన జీవితంలో ముఖ్యంగా బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది.. దావత్ అనే షో కి గెస్ట్ గా వచ్చిన ఈమె అందులో మాట్లాడుతూ.. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఆమెని చూడలేకపోయాను. ఆ సందర్భం ఎన్నో సంవత్సరాలు నన్ను వేధించింది… నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు ఇందిరా పార్కుకి వెళ్తే అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఎవడో వచ్చి నన్ను పొదుల చాటుకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు.. అది రేపు అటెంప్ట్ అనే చెప్పాలి… ఇక ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది.. నైట్ బెడ్ పై మా నాన్న, మామ పడుకున్నా కూడా చాలా భయం వేస్తుంది.. అంతలా ఆ సంఘటన నన్ను చిదిమేసింది అంటూ ఎమోషనల్ అయింది స్నిగ్ధ.. ఇక ప్రస్తుతం స్నిగ్ధ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

స్నిగ్ధ కెరియర్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నగరంలో జగదీష్, రాజేశ్వరి దంపతులకు జన్మించిన స్నిగ్ధ.. ఈమె తండ్రి డాక్టర్ కాగా తల్లి గృహిణి.. ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో ఎంబీఏ చదువుతున్నప్పుడు బంగారు పథకం కూడా సాధించింది. ఇక సినిమాల్లోకి రాకముందే హైదరాబాదులోని లాజికల్ బైట్స్ లో హెచ్ ఆర్ మేనేజర్ గా కూడా పనిచేసిన స్నిగ్ధ సినిమాల పైన ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఇక ఆమె నటనతో లఘు చిత్రాలలో సంగీత స్వరకల్పన కూడా చేసింది. ఈమె నటి మాత్రమే కాదు సంగీతం కళాకారిణి కూడా.. 2015 వ సంవత్సరంలో నటించిన జత కలిసే అనే చిత్రంలో ఉత్తమ హాస్యనటిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యుత్తమ పౌర పురస్కారం నంది పురస్కారాన్ని కూడా దక్కించుకుంది.. ఇక ప్రస్తుతం అడపాదడపా అక్కడక్కడ కనిపిస్తోంది తప్ప వరుసగా అవకాశాలు అందుకోవడం లేదు.. లేడీ కమెడియన్లు కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో స్నిగ్ధ లాంటి సీనియర్స్ కి అవకాశాలు రావడం లేదని చెప్పవచ్చు.. మళ్లీ ఈమె సినిమాలలో అవకాశాలు దక్కించుకొని పూర్వవైభవాన్ని పొందాలని ఆమె అభిమానులే కాదు సన్నిహిత సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు. మరి స్నిగ్ధ కి ఏ మేరకు అవకాశాలు లభిస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు