Actress Snigdha: 45 యేళ్లు వచ్చినా.. అందుకే పెళ్లికి దూరం..!

చూడగానే అబ్బాయా అనిపించేలా తన మేనరిజంతో అందరినీ అలరిస్తూ ఉంటుంది ప్రముఖ నటి స్నిగ్ధ.. అలా మొదలైంది , మేం వయసుకు వచ్చాం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తన ఆహార్యంతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఆడపిల్లే అయినా సరే మగరాయుడు గెటప్ లో ఆమె పండించే హాస్యానికి అభిమానులు కూడా ఫిదా అవుతారు.. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా స్నిగ్ధ మగరాయుడనే చెప్పాలి.. ఏ విషయంలో అయినా సరే డేర్ గా ఉంటారనేది వాస్తవం. వాస్తవానికి స్నిగ్ధ శివ భక్తురాలు.. ప్రతి సంవత్సరం కూడా శివమాల ధరిస్తానని..గతంలో కూడా పలు వేదికల ద్వారా తెలిపింది..

స్నిగ్ధ సినిమా కెరియర్..
ఈ క్రమంలోననే ఒక ప్రోగ్రాంలో స్నిగ్ధ ను చూసిన డైరెక్టర్ నందిని రెడ్డి మొదట ఆమెకు అలా మొదలైంది అనే సినిమాలో అవకాశం ఇచ్చింది.. అయితే ఆ సినిమా ద్వారా తనకు మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ..

పెళ్లిపై స్నిగ్ధ క్లారిటీ..
ఇకపోతే ఈమె ప్రస్తుత వయసు 43 సంవత్సరాలు.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే జీవితాన్ని సాగిస్తోంది.. ఈ విషయంపై తాజాగా ప్రశ్నించగా తాను ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది స్నిగ్ధ.. స్నిగ్ధ మాట్లాడుతూ.. నాకు పెళ్లి అనే బంధం పై పెద్దగా నమ్మకం లేదు.. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కూడా కలగలేదు.. ఇప్పటివరకు నా జీవితంలో అలాంటి సందర్భం కూడా రాలేదు.. ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను.. 120 రోజులపాటు ఇలా దీక్షలోనే నా టైం గడిచిపోతుంది.. ఇక పెళ్లి చేసుకుంటే మనం వేరొకరి ఆధీనంలోకి వెళ్ళిపోతాము..అందుకే పెళ్లి చేసుకోవడం అంటే అంతగా నాకు ఇష్టం లేదు అంటూ స్నిగ్ధ తన మనసులో మాటను వెల్లడించింది.

- Advertisement -

పెళ్లి, పిల్లలు, జీవితం..
పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత పిల్లల్ని కనాలి.. ఇక జీవితం మొత్తం వారి చుట్టూ తిరుగుతుంది.. అలా నా జీవితాన్ని వారి చుట్టూ తిరిగే బదులు హాయిగా సంపాదించిన దాంట్లో కొంత మన కోసం ఖర్చు పెట్టుకుంటూ. మిగిలిన డబ్బును అనాధాశ్రమంలోని పిల్లలకు ఇస్తే వాళ్లు బాగుపడతారు కదా.. ప్రస్తుతం నేను కూడా అలాంటి పనే చేస్తున్నాను.. ఫైనల్గా నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏమీ లేదు అంటూ ఆమె తేల్చి చెప్పేసింది..

నెటిజెన్స్ ప్రశంసలు..
ఇకపోతే ఈమె మాట్లాడిన మాటలకు కొంతమంది నెటిజెన్ లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు కదా.. మనకంటూ స్వేచ్ఛ కావాలి.. ఆ స్వేచ్ఛ కొంతమంది పెళ్లిలో కోరుకుంటే.. మరికొంతమంది సింగిల్ గా ఉంటూ తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. ఇప్పుడు స్నిగ్ధ కూడా అదే చేస్తోంది.. తాను సంపాదించిన దాంట్లో తాను కొంచెం మిగిల్చుకొని మిగతాది ఇతరులకు పంచడం నిజంగా ప్రశంసనీయం అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు